Kavya Maran : సన్ రైజర్స్ ‘కావ్య మారన్’ కార్ల గురించి తెలిస్తే.. షాక్ కావాల్సిందే
Kavya Maran : ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ టీం యజమాని కావ్య మారన్ పేరు ఇప్పుడు నెట్టింట్ట మార్మోగుతోంది. IPL సన్‌రైజర్స్ విజయాలు, రికార్డుల నేపథ్యంలో జట్టుతోపాటు, కావ్యపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. దీంతో ఆమె నెట్వర్క్, ఆమె లగ్జరీ లైఫ్ గురించి హాట్ టాపిక్ నడుస్తోంది.
‘సన్ రైజర్స్ హైదరాబాద్’ సన్ గ్రూపునకు చెందిన కళానిధి మారన్ యాజమాన్యంలో ఉంది. ఆయన కుమార్తె కావ్య మారన్ 2018 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవోగా ఉన్నారు. దాదాపు ప్రతీ మ్యాచ్‌కు హాజరవుతూ ఆటగాళ్లును ఉత్సాహ పరుస్తోంది. స్టేడియంలో మిలియన్ డాలర్ల చిరునవ్వుతో ఆరెంజ్ ఆర్మీకి అండగా ఉండడమేకాదు.. ఆడియన్స్, క్రికెట్ ఫ్యాన్స్‌కు సందడి పంచుతుంది. ఆమెకున్న లగ్జరీ కార్ల గురించి తెలిస్తే వావ్.. అనాల్సిందే. క్రేజీ కార్స్ చెన్నై సమాచారం ప్రకారం రోల్స్ రాయిస్, బెంట్లీ నుంచి ఫెరారీ వరకు అధునాతన, ఖరీదైన కార్లు ఆమె సొంతం.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB
మారన్ ఫ్యామిలీ గ్యారేజ్‌కు సంబంధించి తొలి ఖరీదైన కారు రోల్స్ రాయిస్. ఈ స్పెషల్ మోడల్ ఫాంటమ్ VIII EWB, దీని ధర భారతదేశంలో రూ. 12.2 కోట్లు. ఫాంటమ్ VIII EWB 6.75-లీటర్ V12 ట్విన్-టర్బో చార్జడ్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తోంది. ఈ భారీ మోటార్ గరిష్టంగా 571 Bhp, 900 Nm గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఫెరారీ రోమా..
చెన్నై వీధుల్లో కనిపించిన కారు ఫెరారీ రోమా. ఐకానిక్ రోస్సో కోర్సా ఫెరారీ రోమా-2021 దేశంలో 4.5 కోట్ల కారు. 3.9-లీటర్ ట్విన్-టర్బో చార్జ్ డ్ V8 ఇంజిన్‌తో వస్తుంది. 690 PS, గరిష్ట టార్క్ 760 Nm. అందిస్తుంది.
బెంట్లీ బెంటెగా EWB..
రెడ్ షేడ్‌లో బెంట్లీ కారు ఖరీదైన కార్ల జాబితాలో మూడోది. బెంటెగా ఎక్స్టెండెడ్ వీల్‌బేస్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 6 కోట్లుగా ఉంటుంది.
BMW i7..
ఈ జాబితాలో లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్. BMW i7 ఈ కారు బ్లాక్ సఫైర్ మెటాలిక్ షేడ్ అదిరిపోయే లుక్‌తో ఉంటుంది. ఇవన్నీ కావ్య మారన్ వద్ద ఉన్న కార్లు.
సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి- కావేరి దంపతుల కూతురు కావ్య మారన్. 1992, ఆగస్ట్ 6న చెన్నైలో జన్మించింది. చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీ, UKలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా అందుకుంది. ప్రస్తుతం సన్ టీవీలో కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న కావ్య నికర ఆస్తుల విలువ దాదాపుగా రూ. 409 కోట్లు (50 మిలియన్ డాలర్లు) అని తెలుస్తోంది. కావ్య తాత మురసోలి మారన్ డీఎంకే తరుఫున యుపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. కావ్య చిన్నన్న దయానిధి మారన్ మాజీ ఎంపీ. దివంగత తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కావ్య వాళ్ల తాతయ్యకు మామయ్య.