Bhashyam Praveen : గ్రామ దేవతలను దర్శించుకున్న పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్

Bhashyam Praveen
Bhashyam Praveen : అచ్చంపేట మండలం, రుద్రవరం గ్రామంలో గ్రామ దేవతలను తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ దర్శించుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, నంబూలా వారసుల కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు రుద్రవరం వెళ్లిన భాష్యం ప్రవీణ్ రేణుకమ్మ గంగమ్మ తల్లి కొలుపులో పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ రేణుకమ్మ గంగమ్మ తల్లి కొలుపులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గ్రామ దేవతలను దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్టొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.