PBKS Vs GT : పంజాబ్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్ మధ్య ఆసక్తికర పోరు
PBKS Vs GT : పంజాబ్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం సాయంత్రం మరో ఆసక్తికర పోరు జరగనుంది. పంజాబ్ ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడి రెండింట్లోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్ లు ఆడి మూడు మాత్రమే గెలిచి 4 మ్యాచ్ ల్లో ఓడిపోయి ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ కు పంజాబ్ కు చావో రేవో లాంటి మ్యాచ్ ఇది.
ఈ మ్యాచ్ లో ఓడిపోతే ప్లే ఆప్ రేసు కు వెళ్లే దారులు మూసుకుపోతాయి. పంజాబ్ కింగ్స్ లో స్టార్ బ్యాట్స్ మెన్ లు దారుణంగా విఫలమవుతున్నారు. లివింగ్ స్టోన్, సామ్ కర్రన్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చూపించడం లేదు. చివర్లో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఇద్దరు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఒత్తిడిని చిత్తు చేస్తూ చివరి వరకు పోరాడుతున్నారు. ఎంత పోరాడినా మొదట్లో మంచి ఆరంభం రాకపోయే సరికి వారి పోరాటం వృథా అవుతోంది.
ఇటు గుజరాత్ బ్యాటర్లు కూడా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నారు. గిల్ అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. సాహా పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. మిల్లర్ ఇంకా ఫామ్ ను అందుకోలేదు. రాహుల్ తెవాటియా రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ లో రషీద్ ఖాన్ మునుపటిలా పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోతున్నాడు.
పంజాబ్ కెప్టెన్ శిఖర్ దావన్ ఇంకా భుజం గాయం నుంచి కోలుకోలేదు. పంజాబ్ తన హోం గ్రౌండ్ అయినా ముల్హాన్ పూర్ లో ఇప్పటికే మూడు ఓటములతో వెనకబడింది. గుజరాత్ తో ఇది నాలుగో మ్యాచ్. ఈ మ్యాచ్ లో నైనా గెలవాలని బలంగా కోరుకుంటోంది. పంజాబ్ గెలిచిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి గుజరాత్ పైనే కావడం విశేషం. శశాంక్ సింగ్ సూపర్ పర్ఫార్మెన్స్ తో 200 టార్గెట్ ఛేజ్ చేసి శభాష్ అనిపించుకున్నాడు.