Sunrisers Hyderabad : సన్ రైజర్స్ సిక్సుల సునామీ.. ఢిల్లీపై ఘన విజయం 

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad : అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో  సన్ రైజర్స్ హైదరాబాద్ సిక్సుల సునామీతో లోకల్ టీంపై భారీ విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంత్ చేసింది తప్పని తెలుసుకునేందుకు ఎంతో సేపు పట్టలేదు.  పవర్ ప్లేలోని మొదటి ఆరు ఓవర్లలోనే సన్ రైజర్స్ 125 పరుగులు చేసిందంటే ఎంతలా విధ్వంసం సృష్టించారో అర్థం చేసుకోవచ్చు. 

సన్ రైజర్స్ ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించారు. హెడ్ 32 బంతుల్లో ఆరు సిక్సులు, 11 బౌండరీల సాయంతో 89 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ విధ్వంసం మరోలా ఉంది. 12 బంతుల్లో 6 సిక్సులు, 2 ఫోర్లలో 46 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు.  వీరి విధ్వంసానికి తోడు షెబాజ్ అహ్మద్ 29 బంతుల్లో 59 పరుగులతో సన్ రైజర్స్ 266/7 పరుగులతో ఇన్సింగ్స్ ను ముగించింది. 

అనంతరం ఢిల్లీ జట్టు రెండో ఇన్సింగ్స్ ప్రారంభించగా..  పృథ్వీ షా మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మొదటి నాలుగు బంతుల్లోనే 4 ఫోర్లు కొట్టి 5 బంతికి అవుటయ్యాడు. డేవిడ్ వార్నర్ విఫలం కాగా.. ఆ తర్వాత ప్రేజర్ ముగుర్క్, అభిషేక్ పొరేల్ చెలరేగి ఆడారు. ప్రేజర్ వాషింగ్టన్ సుందర్ వేసిన మూడో ఓవర్ లో మూడు సిక్సులు, మూడు ఫోర్లతో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆరు ఓవర్లలోనే వంద పరుగులు పూర్తి చేసుకుని ఛేజింగ్ లో దూసుకెళ్లింది. 

ఈ దశలో 15 బంతుల్లోనే ప్రేజర్ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రేజర్ 18 బంతుల్లో 7 సిక్సులు, 5 ఫోర్లలో 65 పరుగుల చేసి మయంక్ మార్కండే బౌలింగ్ లో ఔటయ్యాడు. అభిషేక్ పొరెల్ కూడా 7 సిక్సులు, 1 ఫోర్ తో 22 బంతుల్లో 42 పరుగులు చేసి ఢిల్లీని గాడిలో పెట్టగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఒత్తిడికి తట్టుకోలేక ఔటయ్యారు. పంత్ 44 పరుగులు చేసినా అవి మ్యాచ్ ను గెలిపించలేకపోగా.. కేవలం అంతరాన్ని మాత్రమే తగ్గించాయి. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 55 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా.. సన్ రైజర్స్ లో నటరాజన్ నాలుగు ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం గమనార్హం. మ్యాన్ ఆప్ ది మ్యాచ్ హెడ్ కు లభించింది.

TAGS