Lavanya Tripathi Post Viral : నా భర్త అలాంటోడు.. పెళ్ళైన నెలరోజుల్లోపే తెలిసిపోయిందా? లావణ్య త్రిపాఠి పోస్ట్ వైరల్
Lavanya Tripathi Post Viral : మెగా కోడలు లావణ్య త్రిపాఠీ.. ఈ బిరుదు కోసం ఈ భామ చాలా రోజులే తపస్సు చేసింది.. మరి ఎట్టకేలకు తాను ప్రేమించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నే పెళ్లి చేసుకుని మెగా కోడలు అయ్యింది.. నవంబర్ 1న వీరి పెళ్లి ఘనంగా ఇటలీలో అత్యంత సన్నిహితులు, బంధువులు మధ్య జరిగిన విషయం తెలిసిందే..
అయితే పెళ్లి అయ్యి 20 రోజులు అవుతున్న ఈ భామ ఇంత వరకు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేయలేదు.. కానీ ఇన్నాళ్లకు తన పెళ్లి తంతు, పెళ్లి తర్వాత ఘట్టాలు అన్నిటిని పూర్తి చేసుకుని తీరిక చేసుకుని పోస్ట్ చేసినట్టు ఉంది.. ఇన్ని రోజులు వరుస ఘట్టాలతో బిజీ బిజీగా గడిపిన ఈ భామ పెళ్లి తర్వాత తొలిసారి తన భర్త గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
లావణ్య మొదటిసారి చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఈమె తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన భర్త గురించి చెప్పుకొచ్చింది. ఈమె తన భర్త గురించి పోస్ట్ చేస్తూ.. నా భర్త ఎంతో జాలి, దయ కలిగిన మంచి మనిషి.. ఇంకా చాలా గుణాలు ఉన్నాయి.. కానీ వాటిని నాలోనే దాచుకుంటాను..
మా మూడు రోజుల పెళ్లి ఎంతో అద్భుతంగా కలలో జరిగినట్టు జరిగింది. మా పెళ్ళికి వచ్చి ఆశీర్వదించిన వారికీ మాకు బెస్ట్ విషెష్ చెప్పిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదములు.. అంటూ లావణ్య త్రిపాఠీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఒక రెసెప్షన్ మళ్ళీ లావణ్య సొంత ఊరు డెహ్రాడూన్ లో ఒక రెసెప్షన్ చేసుకుని ఈ జంట బిజీ బిజీగా గడుపుతున్నారు.
View this post on Instagram