CSK VS LSG : చెన్నై సూపర్ కింగ్స్ కు షాకిచ్చిన లక్నో సూపర్ గెయింట్స్
CSK VS LSG : చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య లక్నో లోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకాన గ్రౌండ్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో చెన్నైను లోకల్ టీం లక్నో ఓడించింది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో లో స్కోరింగ్ చేసి ఓడిపోయిన లక్నో ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. అనుకున్నట్లుగానే పిచ్ స్లో గా ఉండడంతో మొదట్లో బంతి బ్యాట్ మీదకు రాలేదు. దీంతో మొదటి ఇన్సింగ్స్ లో ఫస్ట్ పది ఓవర్ల వరకు రన్స్ పెద్దగా రాలేవు.
చివర్లో మొయిన్ అలీ హ్యట్రిక్ సిక్సులు, దోని 9 బంతుల్లో మూడు సిక్సులు, రెండు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేయడంతో చెన్నై ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జడేజా హాప్ సెంచరీతో చెలరేగగా.. మొయిన్ అలీ 30, అజింక్య రహనే 36 పరుగులు చేశారు.
అనంతరం ఛేదనకు దిగిన లక్నో ఓపెనింగ్ భాగస్వామ్యం అదిరిపోయేలా ఇచ్చారు. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ ఇద్దరు కలిసి 134 పరుగుల భారీ పార్ట్ నర్ షిప్ చేయడంతో లక్నో చెన్నైతో మ్యాచ్ లో అలవోకగా గెలిచింది. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 82 పరుగులు చేయగా.. క్వింటన్ డికాక్ 54 పరుగులు చేశాడు. వీరిద్దరూ మొదట్లో కాస్త స్లోగా ఆడినప్పటికీ చివరకు గెలుపు తీరాలకు తీసుకెళ్లారు.
వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటైనా నికోలస్ పూరన్, మార్కస్ స్టోనియిస్ ఇద్దరు 177 పరుగుల లక్ష్యాన్ని ఒక ఓవర్ మిగిలి ఉండగానే కొట్టేశారు. అయితే గత రెండు మ్యాచ్ ల్లో తక్కువ స్కోరు చేయడంతో నెట్ రన్ రేట్ తగ్గి పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి లక్నో పరిమితమైంది. చెన్నై, హైదరాబాద్ రెండు జట్లు నాలుగు పాయింట్లతో ఉండగా.. చెన్నై మూడో స్థానం, సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ లక్నో నెట్ రన్ రేట్ తగ్గిపోవడం వల్ల అయిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాబోయే మ్యాచ్ ల్లో మరింత మెరుగైన రన్ రేట్ కావాలంటే లక్నో టీం దూకుడైన ఆటతీరు కనబర్చాల్సిందే.