Mangalagiri : మంగళగిరిలో ఓటమిని వైసీపీ ముందే అంగీకరించిందా

Mangalagiri

Mangalagiri

Mangalagiri : టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ తొలిరోజే మంగళగిరిలో నామినేషన్ వేశాడు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెంటరాగా.. మంగళగిరిలోని సీతారామ ఆలయంలో స్వామివారి పాదాల చెంత నామినేషన్స్ పత్రాలు ఉంచి పూజలు చేశారు. సుమారు పది వేల మందితో ఎలక్షన్ ర్యాలీ తీశారు.

గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభంజనంలో నారా లోకేశ్ కూడా మంగళగిరిలో ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ రెడ్డి పై పోటీ చేయగా.. దాదాపు 13 వేల ఓట్ల తేడాతో మట్టి కరిచాడు. అయినప్పటికీ మంగళగిరిలోనే మళ్లీ పోటీ చేస్తానని చెప్పాడు. యువగళం పాదయాత్ర చేసి అందరికీ సుపరిచితుడయ్యారు. పాదయాత్ర సమయంలో చంద్రబాబు ను అరెస్ఠు చేసినపుడు ప్రజల్లోకి వెళ్లి పార్టీని రక్షించుకున్నాడు.

మంగళగిరిలో ఎన్టీఆర్ హయాంలో తప్పితే ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థులు గెలిచిన దాఖలాలు లేవు. అలాంటి కఠినమైన నియోజకవర్గాన్ని ఎన్నుకున్నానని ఆయన ప్రసంగంలో చెప్పేవారు. లేదంటే నాకేదో కుప్పం లాంటి చోట పోటీ చేస్తే ఎలాగైన గెలిచేవాణ్ని కానీ పోటీ చేస్తే ఇలాంటి చోటే చేయాలి.. గెలవాలనే కసితో ఇక్కడ పోటీ చేశానని గతంలో ప్రకటించారు.

మంగళగిరిలో వైసీపీ నాయకులు అనేక వ్యుహాలు రచించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డిని గంజి చిరంజీవి కాదని, మురుగుడు లావణ్యని వైసీపీ అభ్యర్థిగా చేయాలని అనుకున్నారు. దీంతో ఆళ్ల ఆవేదనతో షర్మిల వెంట నడిచాడు. మళ్లీ వైసీపీలోకి తిరిగొచ్చి ఆయన పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. అంటే అభ్యర్థులను మార్చడం ద్వారా పోటీ నుంచి వైసీపీ ముందే తప్పుకున్నట్లు అయిందని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సారి నారా లోకేశ్ తప్పకుండా గెలుస్తారని అందరూ అంచనా వేస్తున్నారు. నారా లోకేశ్ కోసం ప్రత్యేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ అక్కడ పని చేస్తున్నట్లు తెలుస్తుంది. లోకేశ్ కూడా ప్రజా గళం యాత్ర ద్వారా జగన్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపారు. రాజధాని అమరావతి విషయంలో ఇతర సంక్షేమ పథకాల్లో జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

TAGS