KCR Bus Yatra : ఏప్రిల్ 22 నుంచి కేసీఆర్ బస్సుయాత్ర

KCR Bus Yatra
KCR Bus Yatra : బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 22 నుంచి మే 10వ తేదీ వరకు కేసీఆర్ బస్సుయాత్ర షెడ్యూల్ ఖరారైంది. కేసీఆర్ బస్సుయాత్రకు ఈసీ వికాస్ రాజ్ కూడా అనుమతి మంజూరు చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3 లేదా 4 రోడ్ షోలు ఉండనున్నాయి. రోడ్ షోలు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. అక్కడక్కడ బహిరంగ సభలు ఉంటాయి.
తెలంగాణ గొంతుకే అజెండాగా, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు సిద్ధమైంది. బస్సుయాత్రలో కేంద్రం లోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రచారం చేయనున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలను బీఆర్ఎస్ రూపొందించింది.