BRS MLA : గాంధీ భవన్ దారిపట్టిన మరో గులాబీ ఎమ్మెల్యే
BRS MLA : తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు కొద్ధి రోజుల సమయమే మిగిలి ఉంది.ఇప్పటివరకు అభ్యర్థుల ఎంపికపైననే బిజెపి,కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు దృష్టి సారించాయి.కాంగ్రెస్ ఇంకా మరో మూడు స్థానాల్లో అభ్యర్థుల కోసం వడపోతలోనే ఉంది.. ఈ మూడు ప్రధాన పార్టీలు ఒకవైపు అభ్యర్థుల ఎంపిక పై కఠినంగా వ్యవజారిస్తూనే,మరోవైపు చేరికలపై కన్నేశాయి.చేరికల కార్యక్రమంలో ఎక్కువగా నష్టపోయింది మాత్రం భారత రాష్ట్ర సమితి కావడం జరిగింది.
గాంధీ భవన్ వైపు గులాబీ నేతల చూపులు ..
కాంగ్రెస్ అధికారం చేపట్టగానే గులాబీ పార్టీకి చెందిన నేతలు ఒక్కొకరుగా గాంధీ భవన్ వైపు నడవడం మొదలుపెట్టారు.భారత రాష్ట్ర సమితిని వీడి పలువురు ఈ పాటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.సీనియర్ నాయకుడైన కేశవరావు కూతురు,గ్రేటర్ చైర్ పర్సన్ గద్వాల విజయ లక్ష్మి మూడు రంగుల కప్పుకున్న సంగతి విదితమే.కేశవరావు కూడా మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు.కాంగ్రెస్ లో చేరే విషయాన్ని ఆయనే స్వయంగ అంగీకరించడం విశేషం.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గులాబీ పార్టీ సీనియర్ నాయకుడు,సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్న క్లాసుమేట్ కడియం శ్రీహరి కూడా గులాబీ జెండా దించి,మూడు రంగుల జెండా ఎత్తడం జరిగింది.ఆయన కూతురు కావ్యకు ఎంపీగా పోటీచేయడానికి కేసీఆర్ అవకాశం కూడా ఇచ్చారు.ఆ అవకాశాన్ని వదులుకొని తండ్రి క్లాసుమేట్ రేవంత్ రెడ్డి బాటలో నడవడానికి సిద్దమయ్యింది.ఇప్పుడు ఆమెకే కాంగ్రెస్ టికెట్ ఖాయమయ్యింది కూడా. కారు గుర్తుపై గెలిచిన దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఎంపీగా సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచారు.
కారుదిగుతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే
తాజాగా అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ పరిధిలోని మరో ఎమ్మెల్యే కూడా కారు దిగి కాంగ్రెస్ పీఠం ఎక్కబోతున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గాంధీ భవన్ బాట వైపు నడవడానికి సిద్ధమయ్యారు. శుక్రవారం పీసీసీ చీఫ్, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గాంధీ భవన్ లో ఇదేరోజు ముహూర్తాన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రకాష్ గౌడ్ చేరికతో కారు దిగి మూడు రంగుల జెండా ఎత్తుకున్నవారి సంఖ్య నాలుగుకు చేరుతుంది.2009 లో రాజేంద్ర నగర్ నియోజకవర్గంగ అవతరించింది.ప్రకాష్ గౌడ్ 2009 లోనే రాజకీయ ప్రవేశం చేసి మొదటిసారి తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు.
ఆ తరువాత 2014 లో వచ్చిన ఎన్నికల్లో కూడా టిడిపి నుంచే రెండోసారి గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన తరువాత గులాబీ గూటికి చేరిన ప్రకాష్ గౌడ్ 2018,2023 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కారు గుర్తుపై విజయం సాధించారు.పేరుకు పేరు ,పలుకుబడి,ప్రజాబలం ఉన్న నేత ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళుతున్నడంటే విడిచిన పార్టీకి పెద్ద దెబ్బ. గ్రేటర్ పరిధిలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరడాన్ని ఎవరూ ఆపలేరనే అభిప్రాయాలూ సైతం గ్రేటర్లో వ్యక్తమ వుతున్నాయి.గ్రేటర్ పరిధిలో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలల్లో పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి మంచిరోజు కోసం వేచిచూస్తున్నట్టు రాజకీయ వర్గాల ద్వారా తెలిసింది.