AP Elections 2024 : అధికారుల తీరు ఇలా ఉంటే ఎన్నికలు సజావుగా జరిగేనా?
AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నిబంధనలను సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎన్నికలు సజావుగా సాగుతాయనే విశ్వాసం ప్రజల్లో రావడం లేదు. ఉన్నతాధికారులు రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహించకుండా తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. దీంతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం మాత్రం విధులు సరిగా నిర్వహించడం లేదు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో తమ ఉద్యోగాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఇదే కోవలో వెంకట్రామిరెడ్డి సస్పెండ్ కావడం తెలిసిందే.
ఏపీలో ఎలాంటి గొడవలు జరిగినా నిందితులను వదిలేసి దాడికి గురైన వారినే అరెస్టులు చేస్తుండటం గమనార్హం. దీంతో వారి విధి నిర్వహణ సక్రమంగా చేయడం లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతున్నాయనడంలో సందేహం లేదని తెలుస్తోంది.
జవహర్ రెడ్డి, రాజేంద్ర నాథ్ రెడ్డి లాంటి సీనియర్ అధికారులను బదిలీ చేసినా వారి తీరు మారడం లేదు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల తీరుతో విసిగిపోతున్నామని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. సిసోడియా, ద్వారకా తిరుమల రావులను నియమించినా ఇంకా కిందిస్థాయి ఉద్యోగుల్లో సైతం జగన్ కు అనుకూలంగా వ్యవహరించేవారున్నారని తెలుస్తోంది.
ఇలా అధికార యంత్రాంగం ఏపీలో జగన్ కు అనుకూలంగా నడుచుకుంటుంటే ప్రతిపక్ష పార్టీలు మొత్తుకుంటున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కానీ ఈసీ మాత్రం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తుందని అంటున్నారు. అధికారులతో పని చేయించడానికి ఈసీ తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.