Pushpa-2 : పుష్ప-2 ఆల్ టైం రికార్డు.. రిలీజైతే ఇంకెన్ని రికార్డులో..

Pushpa-2

Pushpa-2

Pushpa-2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 రికార్డుల పరంపర కొనసాగించనుంది. విడుదలకు ముందే ఎన్నో అంచనాలకు కేంద్ర బిందువుగా మారింది. పుష్ప సినిమా కూడా క్రికెటర్లు, క్రీడాకారులు, రాజకీయ నేతలు, ఇతరుల నోళ్లలో నానింది. ఆ సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ అందరికీ అలవాటైపోయింది. దీనికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప-2 కూడా నూతన ట్రెండ్ క్రియేట్ చేస్తుందని అంతా అనుకుంటున్నారు.

పుష్ప-2 కోసం అందరు ఎదురుచూస్తున్నారు. సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో అల్లు అర్జున్ లుక్స్ ప్రత్యేకంగా ఉండనున్నాయి. ఆయన వేషధారణ కూడా డిఫెరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఒక సన్నివేషానికి సుమారు రూ.60 కోట్లు ఖర్చయ్యాయంటే సినిమాను ఎంత చాలెంజింగ్ గా తీసుకుంటున్నారో తెలుస్తోంది.

పుష్ప-2 సినిమా ఆడియో రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రూ.60 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు అంచనా. సినిమా ఓటీటీ రైట్స్ అమ్మకాలు కూడా ఆల్ టైం రికార్డుగా చెబుతున్నారు. పుష్ప-2 ఓటీటీ రైట్స్ సుమారుగా రూ.275 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. సినిమా బిజినెస్ రూ.200 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది.

పుష్ప2 బిజినెస్ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఖ్యాతి చెందింది. పాన్ ఇండియా మూవీ కావడంతో ట్రేడ్ వర్గాలకు ఓ వరంలా మారింది. సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర వర్గాలు తెలియజేస్తున్నాయి. పుష్ప-2 విడుదలకు ముందే ఇన్ని అంచనాలు పెరగడం చూస్తుంటే కచ్చితంగా నూతన శకానికి నాంది అవుతుందని అంటున్నారు.

అల్లు అర్జున్ కు పుష్ప-2 మరో ట్రెండ్ క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకుల అంచనా. పుష్పకు అల్లు అర్జున్ కు జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2 కూడా అల్లు అర్జున్ కు ఎలాంటి ఊపు తీసుకొస్తుందో తెలియడం లేదు. అందుకే పుష్ప-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు.

 

TAGS