Inter Fail Students : ఇంటర్ ఫెయిల్ విద్యార్థులకు అలర్ట్

Inter Fail Students

Inter Fail Students

Inter Fail Students : ఏపిలోని ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ డు సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఈ నెల 24 వరకు చెల్లించవచ్చు. జనరల్, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలకు రూ.550, ప్రాక్టికల్స్ కు రూ.250, బ్రిడ్జి కోర్సు పరీక్షలను రాసేందుకు రూ.150 చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది.

ఇంకా మార్కుల మెరుగుదల కోసం రాసే ఇంప్రూవ్ మెంట్ పరీక్షలకు రూ.550 ఫీజుతో పాటు ఒక్కో పేపర్ కు రూ.160 చెల్లించాలి. ఫీజులను నేటి నుంచి 24వ తేదీ వరకు చెల్లించాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తారు.

TAGS