Prabhas : కల్కితో ప్రభాస్ లక్కు మళ్లీ తిరిగొచ్చిందోచ్..!

Prabhas look

Prabhas  in Kalki

Prabhas Luck : బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ మూవీతోనే టాలీవుడ్ మూవీలన్నీ బీటౌన్ లో డబ్బింగ్ వెర్షన్ లు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రభాస్ తర్వాత పుష్పతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, రాంచరణ్, కార్తీకేయతో నిఖిల్… వీరంతా బీటౌన్ లో క్రేజీ హీరోలుగా మారారు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ తీసిన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ.. అవన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి.

అతడి మార్కెట్ మాత్రం పడిపోలేదు. ప్రతి మూవీకి అదే క్రేజ్.. అదే హైప్. ఇక, సలార్ మూవీకి అయితే విపరీతమైన హైప్ వచ్చింది. ఆ మూవీ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. బాహుబలిని మించి బిజినెస్ ఆఫర్లు దక్కించుకుంది. కలెక్షన్ల పరంగానూ మూవీ సూపర్ హిట్ గా మిగిలింది. తెలుగు రాష్ట్రాల హక్కులే రూ.165 కోట్ల దాకా అమ్ముడయ్యాయి. అంత పెద్ద మొత్తాన్నీ కూడా రికవరీ చేసింది ఈ మూవీ. డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట తెచ్చిపెట్టింది.

ఇకపోతే, ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రం ‘కల్కి’ దీన్ని మించి బిజినెస్ చేస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో  ఏకంగా రూ.190 కోట్ల మార్కును టచ్ చేసిందని టాక్ వినిపిస్తున్నది. అన్ని ఏరియాలకూ బిజినెస్ పూర్తయినట్లు సమాచారం.  నైజాం ఏరియాలో దాదాపు ఈ సినిమా రైట్స్ రూ.75 కోట్లు పలకగా.. సీడెడ్లో  రూ.30 కోట్లు పలికినట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఆంధ్రా ప్రాంతానికి రూ.80-90 కోట్ల మధ్య డిస్కషన్లు నడుస్తున్నాయి. మొత్తంగా ‘కల్కి’ తెలుగు రాష్ట్రాల బిజినెస్ రూ.190 కోట్లు దాటిపోతోంది. ‘కల్కి’ ఇండియన ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం. దానికి తగ్గట్లే హైప్ మామూలుగా లేదు. ‘ఆదిత్య 369’ తరహా ఫాంటసీ టచ్ ఉన్న థ్రిల్లర్ ఈ మూవీ.

ఇందులో బీటౌన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ లాంటి స్టార్లు నటిస్తుండగా.. దీపికా పదుకొణే హీరోయిన్ గా నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మే 9నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, అనుకున్న టైంకే మూవీని రిలీజ్ చేయడం చాలా కష్టంగా మారింది. పైగా, అది అసలే ఎలక్షన్ టైం. అందుకే మూవీని కొన్ని రోజులు వాయిదా వేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

TAGS