సౌదీ అరేబియాలో పెను తుఫాన్ బీభత్సం.. వైరల్ వీడియో
Huge Storm in Soudi Arabia : మనిషి చేసే తప్పిదాలే వినాశనానికి దారితీస్తున్నాయి. దీనివల్లే ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం, కొండచరియలు విరిగిపడడం, కార్చిచ్చులు, తుఫాన్లు మనిషిని భయపెడుతున్నాయి. అకాల వర్షాలు అలజడిని సృష్టిస్తున్నాయి. గాలివాన బీభత్సం కలిగిస్తోంది. సౌదీ అరేబియాలో తుఫాన్ కలిగించిన ఉత్పాతం మామూలుగా లేదు. తుఫాన్ దాటికి ప్రజలు చెల్లాచెదురైపోయారు. వాహనాలు కూడా కొట్టుకుపోయాయి.
బిల్డింగులు సైతం నేలకొరిగాయి. గుడారాలు లేచిపోయాయి. చెట్లు కూలిపోయాయి. ఆ దేశం మొత్తం భీతావహ వాతావరణం నెలకొంది. ప్రసిద్ధ నగరాలైన జెడ్డా, మక్కాల్లో భీకర గాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో విధ్వంస వాతావరణం ఏర్పడింది. రోడ్లపై హోర్డింగులు, టవర్లు నేలకొరిగాయి. తీవ్ర ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
భారీ వస్తువులు కూడా గాలికి కొట్టుకుపోయాయి. రోడ్లపై జనం కూడా ఎగిరి కిందపడ్డారంటే తుఫాన్ ధాటి ఎంత ఉందో తెలుస్తోంది. జెడ్డాలో మేఘాలు కమ్ముకున్నాయి. 24 గంటల పాటు అసాధారణ వాతావరణం ఉంటుందని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మక్కా ధువల్, జెడ్డా, రబీగ్ గవర్నరేట్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే ఉండాల్సి వచ్చింది. జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం సూచనలు జారీ చేసింది. జెడ్డాతో పాటు రాబిమ్, ఖులాయిస్ పట్టణాల్లో వర్ష బీభత్సం కలిగించాయి. ఈ పట్టణాల్లో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడటంతో ఎటు వెళ్లలేని పరిస్థితి.
సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న తుఫాన్ కారణంగా చాలా ప్రాంతాలు భయానక వాతావరణంలోనే గడుపుతున్నాయి. మళ్లీ ఏ విపత్తు వస్తుందో ఏమోననే బెంగ అందరిలో పట్టుకుంది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. తుఫాన్ కారణంగా దేశం మొత్తం భీతావహ వాతావరణం నెలకొంది.