Chamanti Tea : చామంతి పూలతో చేసిన టీ తాగితే ఎంత లాభమో తెలుసా?
Chamanti Tea : మనకు ఆంగ్లేయులు అలవాటు చేసిన టీ విడిచిపెట్టలేకపోతున్నాం. కొందరైతే టీ తాగనిదే ఉదయం పూట చేసుకునే కార్యక్రమాలు కూడా చేయరంటే అతిశయోక్తి కాదు. టీలో ఉండే కెఫిన్ వల్ల మన మెదడు ఉత్తేజితంగా మారుతుంది. దీంతో మనం టీకి ఆకర్షితులం అయిపోతున్నాం. ఆయుర్వేదం ప్రకారం టీ పొడి కాకుండా కొన్ని చెట్ల కషాయాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
రాత్రి పూట పడుకునే ముందు చామంతి పూల టీ తాగితే మంచి నిద్ర పడుతుంది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఉండటం వల్ల చర్మ సంరక్షణ మెరుగవుతుంది. దీని వల్ల ఆరోగ్యానికి గేమ్ చేంజర్ గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచించారు. చామంతి పూల టీ తాగితే నరాలను రిలాక్స్ చేస్తుంది. ఒంటి నొప్పులకు బామ్ లా ఉపయోగపడుతుంది.
ఒత్తిడి, అలజడిని దూరం చేస్తుంది. దగ్గు, జలుబులను లేకుండా తోడ్పడుతుంది. జీర్ణక్రియ మెరుగు పడటానికి సాయపడుతుంది. ఆందోళన, అలజడిని నిర్వీర్యం చేస్తుంది. ఇలా మనకు చామంతి పూల టీని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనకు లాభాలు కలిగించే టీలను తాగడం ఎంతో ఉత్తమంగా భావించాలి.
ఈ రోజుల్లో చాలా మంది టీ, కాఫీలు తాగుతుంటారు. కానీ వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు. ఇంకా వాటి వల్ల శరీరానికి నష్టాలే తప్ప ఎలాంటి మేలు కలగదు. మన ఒంటికి మేలు చేసే ఇలాంటి చెట్లు, పూల నుంచి వచ్చే టీలను తాగడం మంచిది. గ్రీన్ టీ తాగడం వల్ల కొన్ని లాభాలుంటాయి. కానీ కాఫీ, టీలు సాధ్యమైనంత వరకు దూరం పెట్టడమే మంచిదని తెలుసుకోవాలి.