Delhi Airport : టాప్-10 రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్ పోర్ట్

Delhi Airport

Delhi Airport

Delhi Airport : గత ఏడాది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయాల జాబితాను ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ వెల్లడించింది. అమెరికాలోని అట్టాంటా ఎయిర్ పోర్ట్ ప్రథమ స్థానంలో నిలవగా భారత దేశం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పదో స్థానంలో నిలవడం విశేషం.

అట్లాంటా ఎయిర్ పోర్ట్ తొలి స్థానం.. ఆ తర్వాత స్థానాల్లో దుబాయ్, డల్లాస్, లండన్ (యూకే), టోక్యో (జపాన్), డెన్వార్ (అమెరికా), ఇస్తాంబుల్ (తుర్కియే), లాస్ ఏంజిలిస్, చికాగో ఉన్నాయి. ఢిల్లీ (భారత్) పదో స్థానంలో నిలిచింది.  

ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వెల్లడించిన నివేదిక ప్రకారం.. 2023లో ఢిల్లీ ఎయిర్ పోర్టులో 7 కోట్ల 22 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2022లో రద్దీగా ఉండే జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2019లో 17వ స్థానంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ ఉంది.

TAGS