Gujarat News : రూ.200 కోట్లు విరాళమిచ్చి సన్యాసం..సంపన్న దంపతుల వైరాగ్యం..

Gujarat News

Gujarat News

Gujarat News : వేయి మాటలు చెప్పే బదులు ఒక్క పని చేసి చూపెట్టాలి అంటారు పెద్దలు. అందరూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఉచిత సలహాలు, హామీలు కురిపిస్తుంటారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం తమ స్వార్థం చూసుకుంటారు. ఓ పారిశ్రామిక వేత్త తనకున్న రూ.200 కోట్లు విరాళంగా అందించి సన్యాసి జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆచరించి చూపేవాడు ఆచార్యుడు అన్నట్లు ఇచ్చిన మాటకు కట్టుబడి తన సంపదను త్యాగం చేయడం గొప్పవిషయమే.

గుజరాత్ లోని పారిశ్రామిక వేత్త భవేశ్ భాయి భండారి, ఆయన భార్య తమ సంపదను విరాళంగా అందజేశారు. సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. వారి పిల్లలు 2022లోనే సన్యాసం తీసుకున్నారు. భౌతిక ప్రపంచానికి దూరంగా సన్యాసిగా మారేందుకు నిర్ణయించుకున్నారు. కేవలం భిక్షాటన మాత్రమే చేస్తూ దాని ద్వారా వచ్చే దానితోనే వారి జీవన కొనసాగనుంది.

సబర్ కాంత జిల్లాలోని హిమ్మత్ నగర్ లో భారీ ఊరేగింపు నిర్వహించి సన్యాస దీక్ష స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆధ్యాత్మిక అన్వేషణలో ముందడుగు వేయాలని చూస్తున్నారు. ఏప్రిల్ 22న నది ఒడ్డున సన్యాస దీక్ష స్వీకరించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దంపతులిద్దరూ సన్యాస దీక్ష స్వీకరించి శేష జీవితం భగవత్ ధ్యానంలో గడపాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఎంత ధనముంటే అన్ని బాధలుంటాయనే ఉద్దేశంతో వారి సంపాదన వదిలిపెట్టి సన్యాసం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. భౌతిక కష్టాలకు డబ్బులే కారణమని తెలుసుకున్నారు. ఐహిక సుఖాలకు దూరంగా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుందని భావిస్తున్నారు. దీని కోసం వారి డబ్బును మొత్తం దానం చేసి సన్యాస దీక్షకు ఉపక్రమిస్తున్నారు.

మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనుషులకు సేవ చేయడంలోనే అసలైన పుణ్యం లభిస్తుంది. అందుకే డబ్బు కన్నా ప్రశాంతమైన జీవితం గడపాలంటే మన చేతిలో ధనం ఉండకూడదని తెలుసుకున్నారు. దీంతోనే ప్రశాంతమైన జీవనం లభిస్తుందని వారి నమ్మకం.

TAGS