Bhashyam Praveen : గ్రామ సమస్యలను పరిష్కరిస్తా : ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్

Bhashyam Praveen wife Campaign
Bhashyam Praveen : గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రమైన అచ్చంపేట గ్రామంలో ఈ రోజు పర్యటించారు. గడపగడపకి వెళ్లిన ఆయన సూపర్ సిక్స్ పథకాల గురించి గ్రామస్థులకు వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కోరారు.
గ్రామంలో పెదకూరపాడు నియోజకవర్గ భాష్యం ప్రవీణ్ తో పాటు ఆయన సతీమణి భాష్యం లావణ్య, సోదరుడు భాష్యం నవీన్ సతీమణి భాష్యం దీప్తి పాల్గొని గ్రామస్థులతో మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.