Mega Family : పవన్ కు ‘మెగా’ అభయం

Mega Family

Mega Family Support to Pawan

Mega Family Support to Janasena : పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రస్తుతం ఒక వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన కమిట్ మెంట్లు, డేట్ల ప్రకారం పవర్ స్టార్ వంత షూటింగ్స్ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం ఎలక్షన్ క్యాంపెయిన్ లో సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు.

నాగబాబు తప్ప మెగా ఫ్యామిలీ దూరం..

2014లో జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ కు మెగా ఫ్యామిలీ నుంచి పొలిటికల్ సపోర్ట్ లభించలేదు. కేవలం ఒక్క నాగబాబు మాత్రమే బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేశారు. కానీ నేరుగ పార్టీ నిర్ణయాలు, కార్యక్రమాల రూప కల్పన మాత్రం చేయలేదు.  అన్ని తానై పవన్ కల్యాన్ మాత్రమే చూసుకున్నాడు. పలు సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవిని తమ్ముడి పొలిటికల్ స్ట్రాటజీ గురించి అడిగితే అది అతని వ్యక్తిగతమని, కుటుంబ బంధాలకు, రాజకీయాలకు సంబంధం లేదని ఎన్నో వేదికల మీద చెప్పుకొచ్చాడు. రాజకీయాల్లో ఎవరి దారి వారిదేనని ఒకరి ఇష్టాయిష్టాల ప్రకారం నడుచుకోవాల్సిన ప్రకారం అవసరం లేదని స్పష్టం చేశారు. అయిన అతను వెళ్లే దారి పది మంది మంచి కోసమే వెళ్తున్నాడని చెప్పుకొచ్చారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సపోర్ట్ చేయలేదు.

‘చిరు’ సాయం  రూ.5 కోట్లు..

పదేళ్లుగా పవర్ స్టార్ జనసేన పార్టీని నడిపించుకుంటూ వస్తున్నారు. క్షేత్రస్తాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఏ ఒక్కరినీ విరాళం గానీ, పార్టీ ఫండ్ గాని పవర్ స్టార్ అడగడం లేదు. తనే సొంతం పార్టీ కోసం ఖర్చు చేస్తున్నాడు. పార్టీ నడపడానికి ఖర్చంతా పవన్ దే. ఆర్థిక వనరులు పెద్దగా లేవు.  అధికారం లేకపోయినా పవన్ కౌలు రైతుల కోసం తన వంతుగా సాయం చేస్తున్నాడు. ఇదంతా పవన్ చేస్తున్న సినిమాల ద్వారా వచ్చిందే.  తమ్ముడి పోరాటం అన్నయ్య మెగా స్టార్ చిరంజీవిని కదిలించింది. కౌలు రైతుల కోసం పవన్ పడుతున్న తపనను అభినందించలేకుండా ఉండలేపోయాడు మెగాస్టార్. తన వంతుగా రూ. 5 కోట్లు విరాళంగా అందించాడు. అలాగే తన కుమారుడు రామ్ చరణ్ ను కూడా విరాళం అందించాలని అన్నయ్య చెప్పాడని పవన్ తెనాలి  బహిరంగ సభలో చెప్పుకొచ్చాడు.

కుటుంబం అంతా పవన్ వెనకేనా?

తమ కుటుంబసభ్యుడిలా కాకుండా సమాజానికి హితం చేసే వ్యక్తిగా భావించి విరాళం ఇవ్వాలంటూ రామ్ చరణ్ కు తన అన్నయ్య చెప్పారంటూ పవన్ వెల్లడించడం ద్వారా మెగా ఫ్యామిలీ మొత్తం అండగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో జనసేనకు అన్న ఆశీర్వాదం తో పాటు మెగా ఫాన్స్ ఆశీస్సులు కూడా ప్రస్తుతతం పవన్ కు తోడవుతున్నాయి. ఇక ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మెగా ఫ్యామిలీ అంతా పవన్ కు అండగా ఉన్నట్లు స్పష్టమవుతున్నది.

TAGS