Venkatesh-Anil Ravipudi : విక్టరీ వెంకటేశ్.. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మరో మూవీ

Venkatesh-Anil Ravipudi

Venkatesh-Anil Ravipudi

Venkatesh-Anil Ravipudi Combination : హిరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఎప్ 2 మూవీ ఎంతటి జనాదరణ పొందిందో మీకు తెలిసిందే. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ తో అనిల్ ఎఫ్3 కూడా తీశారు. ఇది ఎఫ్ 2 అంతటి ఘన విజయాన్ని సాధించలేకపోయింది. విక్టరీ వెంకటేశ్ నటించిన ఎఫ్ 2 తన సినీ కెరీర్ లో అతి పెద్ద హిట్ మూవీగా నిలిచింది.

అయితే అనిల్ రావిపూడి, వెంకీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 76 వ మూవీ కోసం మీనాక్షి చౌదరి అనే హిరోయిన్ ను ఎంపిక చేశారు. సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాాను దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కించనున్నారు. మీడియం రేంజ్ బడ్జెట్ లోనే దీన్ని తీయనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో రెండో హిరోయిన్ కూడా ఉందట.

ఈ సినిమాను మొదట మల్టీ స్టారర్ మూవీ అనుకున్నారని కానీ తర్వాత వెంకీ ఒక్కరే హిరో గా నటిస్తున్నట్లు ఇందులో యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. రెండో హిరో గా సిద్దు జొన్నలగడ్డ ను అనుకున్నారని అయితే సిద్దు ఈ సినిమాలో నటించడం లేదని కన్ పర్మ్ అయిపోయింది.

విక్టరీ వెంకటేశ్ తో తీస్తున్నఈ మూవీ తో  అనిల్ రావిపూడి హ్యట్రిిక్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. వెంకటేశ్ లాస్ట్ మూవీ సైంధవ్ సగటు సినిమా అభిమానులను మెప్పించలేకపోయింది. డిజాస్టర్ గా మిగలడంతో మళ్లీ అనిల్ రావిపూడి అయితే సరైన హిట్ దొరికే అవకాశం ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.

ఈ అప్ కమింగ్ మూవీకి బీమ్స్ సిసిలీయో మ్యూజిక్ అందిస్తుండగా.. డైరెక్టర్ గా అనిల్ రావిపూడి, నిర్మాత గా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు.  వెంకీ ఈ చిత్రంలో మాజీ పోలీసు అధికారిగా నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఘర్షణ తర్వాత పోలీసు పాత్రలో నటించడం కూడా ఈ చిత్రమే కావడం విశేషం.

TAGS