Google Maps : మరో సంచలనం.. ఏఐతో మారిపోయిన గూగుల్ మ్యాప్స్.. ఇక మరింత ఈజీ

Google Maps

Google Maps

Google Maps : తెలియని ఒక ప్రదేశానికి వెళ్లాలంటే మనకు తోడుండేది ఒక్కటే అదే ‘గూగుల్ మ్యాప్స్’. ప్రపంచ టెక్ దిగ్గడంజ ‘గూగుల్’ దీన్ని రూపొందించిందని మనకు తెలిసిందే కదా. అయితే ఒక్కో సమయంలో కొంచెం తేడా ఉన్నా.. ఎక్కువ సమయాల్లో సరైన గమ్యస్థానమే చూపుతుందని అందరికీ తెలిసిందే. అయితే ఈ గూగుల్ మ్యాప్స్ మరింత అడ్వన్స్ డ్ చేయాలని సంస్థ ఎన్నో సార్లు అనుకుంది. దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్లింది. ఇందులో భాగంగా ఇప్పుడు AI (ఆర్టి ఫిషియల్ ఇంటలిజెంట్) తో కొత్తగా మన ముందుకు రాబోతోంది.

ఏఐతో గుగుల్ మ్యాప్ ఎలా పని చేస్తుందన్న విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ఆయన మాటల్లోనే విందాం.. ‘ప్రతీ రోజు 20 బిలియన్ కిలో మీటర్లను మ్యాప్స్ ఉపయోగించి ప్రయాణం చేస్తున్నారు. అందులో సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్, ఇంకా వాహనాల రాకపోకలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఏఐతో అందులో ఛేంజస్ చేస్తున్నట్లు చెప్పారు.

ఒక సారి న్యూయార్క్ సిటీలో బైక్ డ్రైవ్ చేయాలనుకుంటున్నా.. వాటర్ ఫ్రంట్ వరకు వెళ్లాలనుకున్నా.. గూగుల్ మ్యాప్స్ రెండు కంటే ఎక్కువ డైరెక్షన్లను చూపిస్తుంది. ఏఐతో అది మరింత ఫీల్ తో అందిస్తుంది. నా జర్నీని మొదలు పెడుతుంది. వాటర్ ఫ్రంట్ వరకు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి మరో దారిని కనుగొంటుంది. దీనితో పాటు ట్రాఫిక్, వెదర్ ముందే అంచనా వేస్తుంది. మనం వెళ్లే ప్రదేశంలో వెదర్ తో పాటు ట్రాఫిక్ ఎలా ఉంది మన జర్నీ ఎలా సాగుతుంది అని చూపిస్తుంది.

ఏఐతో కూడిన గూగుల్ మ్యాప్స్ ఈ ఏడాది వేసవి కాలం ముగిసే సమయానికి 15 టాప్ సిటీల్లో ప్రవేశపెడతాం. అందులో లండన్, న్యూయార్స్, టోకియో, సాన్ ఫ్రాన్సిస్ కో కూడా ఉన్నాయి’ అని సుందర్ పిచాయ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో మీ కోసం.

TAGS