Bhashyam Praveen : ఈ ఎన్నికలు మన కోసం కాదు.. ముందు తరాల కోసం – తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్

 Bhashyam Praveen

 Bhashyam Praveen

Bhashyam Praveen : ఈ ఎన్నికలు మన కోసం కాదు మన ముందు తరాల కోసం అనేది గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు. పెదకూరపాడు మండలం బలుసుపాడు గ్రామంలో శనివారం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా చర్చిలో ఆశీర్వచనాలు తీసుకున్న ఆయన ఉమ్మడి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు మన కోసం కాదు మన ముందు తరాల కోసం అనేది గుర్తుపెట్టుకోవాలని, చంద్రబాబు నాయుడు ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తును అందించారని, మూడు పార్టీల పొత్తు రాష్ట్ర అభివృద్ధి కోసమేనని అన్నారు.

రాష్ట్రానికి రాజకీయాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం, అభివృద్ధిని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు అని అన్నారు. అటువంటి తెలుగుదేశం పార్టీలో ఈ పెదకూరపాడు నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. బలుసుపాడు గ్రామానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు మొన్న క్రోసూరులో నిర్వహించిన భారీ బహిరంగ ప్రజాగళం సభకు రావడం జరిగిందని, ఆ సభను పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు సూపర్ సక్సెస్ చేశారు అని అన్నారు. ఆ సక్సెస్ ని తట్టుకోలేక కడుపు మంటతో వైసిపి వాళ్లు మన దేవాలయం లాంటి క్రోసూరులో ఉన్న పార్టీ కార్యాలయాన్ని నిప్పు పెట్టి కాల్చేశారని ఆరోపించారు. అటువంటి వైసీపీ నీచ సంస్కృతిని ప్రజలందరూ గమనించాలని కోరారు.

గ్రామ ప్రజలారా ఆలోచించండి అందరూ వర్గం గురించి ఇంకో దేని గురించి ఆలోచించవద్దు. రేపు మనం ఎన్నికల్లో వేసే ఓటు మన గ్రామ భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని, మన రాజధాని భవిష్యత్తుని నిర్ణయించబోతుందని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. 

TAGS