Manchu Manoj : మంచు మనోజ్ తండ్రయ్యాడు

Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj : మంచు మనోజ్, మౌనిక దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. మౌనిక మంచు మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మౌనిక శనివారం ఉదయం పండంటి బేబీకి జన్మనిచ్చినట్లు మంచు లక్ష్మీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో మంచు మనోజ్ కు సినీ ప్రముఖులు, సెలబ్రేటీలు  శుభాకాంక్షలు చెబుతున్నారు.

మంచు మనోజ్ కు మొదట పెళ్లై భార్యతో మనస్పర్థల కారణంగా విడిపోయారు. విడాకుల విషయం కూడా ఆయన నేరుగా సోెషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ తర్వాత కొన్ని సార్లు మౌనిక తో బయట కనిపించడంతో ఆయనకు మౌనికకు పెళ్లి జరగనుందనే వార్తలు వచ్చాయి. దీంతో వారు దాన్ని నిజం చేశారు. అయితే మౌనికకు కూడా మనోజ్ తో రెండో పెళ్లి కావడం విశేషం.

మౌనిక కు పెళ్లై ధైరవ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ధైరవ్ కు ఇప్పుడు చెల్లె పుట్టిందని కుటుంబ సభ్యులు సంబర పడిపోతున్నారు.  మంచు విష్ణుకు కూడా మొదట కవల పిల్లలు పుట్టారు. మంచు లక్ష్మీ కి కూడా ఆడ కూతురు పుట్టింది. ఇప్పుడు మనోజ్ కు కూడా కూతురు పుట్టడం వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరికి అమ్మాయి పుట్టిందని తెగ సంతోషిస్తున్నారు. మంచు మనోజ్ భార్య మౌనిక ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు.

బేబి డంప్, బేబీ షవర్ ప్రొగ్రాం అంటూ అన్నింటినీ ప్రేక్షకులతో పంచుకున్నాడు. మనోజ్ ఇటీవల ఒక షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. మోహన్ బాబుకు ఒక కూతుురు పుడితే మొత్తం ఫ్యామిలీలో అందరికీ కూతుర్లు పుట్టడం విశేషంగా భావిస్తున్నారు. మౌనిక తల్లిదండ్రులు ఇద్దరు రాజకీయాల్లో ఉండేవారు. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో చనిపోగా..  అతడి భార్య రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ప్రస్తుతం భూమా అఖిల ప్రియ , అతడి సోదరుడు మాత్రమే మౌనికకు అండగా ఉన్నారు. మౌనిక మంచు మనోజ్ ను పెళ్లి చేసుకోవడం చాలా హ్యపీగా ఉందని ఓ షోలో మాట్లాడుతూ.. చెప్పింది. మొత్తం మీద మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మనోజ్ తండ్రయ్యాడు.

TAGS