Police Six Pack : పోలీస్ కండర వీరులు వీరే..సిక్స్ ప్యాక్ తో దుమ్మురేపుతున్నారు..

Police Six Pack

Police Six Pack

Police Six Pack : తిండి కలవాడే కండగలవాడోయి.. కండ గలవాడే మనిషోయి అన్నారు గురజాడ. శరీర పుష్టితోనే మనిషి అందంగా ఉంటాడు. అందుకే మనిషికి మందమే అందమంటారు. బాడీ బిల్డింగ్ పెంచుకుంటే ఆరోగ్యంతోపాటు అన్ని విధాలా మనకు లాభాలుంటాయి. ఈనేపథ్యంలో మన దేశంలో బాడీ బిల్డింగ్ లో మంచి సౌష్టవం ఉన్న వారి గురించి తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కు చెందిన కానిస్టేబుల్ మోతీలాల్ దైమా. కండల వీరుడుగా గుర్తింపు పొందాడు. రోజు జిమ్ కు వెళ్తుంటాడు. నాలుగు సార్లు మిస్టర్ ఇండోర్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇతడిని యువత ఆదర్శంగా తీసుకుంటోంది. ఇప్పుడు మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకోవాలని నిరంతరం శ్రమిస్తున్నాడు. 27 ఏళ్లు మోతీలాల్ మరెన్నో పతకాలు సాధించాలని చూస్తున్నాడు.

ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రూబెల్ ధన్కర్ కూడా బాడీ బిల్డరే. రోజు జిమ్ చేస్తుంటాడు. ఫిట్ నెస్ కోసం నిరంతరం శ్రమిస్తుంటాడు. ఇతడికి ఫాలోవర్స్ కూడా ఎక్కువే. రూబెల్ బయటకు వచ్చాడంటే అందరు అతడిని చూస్తారు. అంతటి అనుచరులను సంపాదించుకున్న రూబెల్ కు సోషల్ మీడియాలో 8 లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

భోపాల్ కు చెందిన ఐపీఎస్ అధికారి సచిన్ అతుల్కర్. 22 ఏళ్లలోనే ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యాడు. ఫిజికల్ ఫిట్ నెస్ అంటే ప్రాణం. పలు పోటీల్లో పతకాలు సాధించాడు. సోషల్ మీడియాలో తన ఫొటోలు పోస్టు చేస్తుంటాడు. ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచాడు. చిన్న వయసులోనే ఐపీఎస్ సాధించి ఎందరికో రోల్ మోడల్ గా మరాడు.

మహారాష్ట్రకు చెందిన పేద కుటుంబంలో జన్మించిన కిషోర్ డాంగే కూడా కానిస్టేబులే. ఇతడు కూడా తన బాడీ బిల్డింగ్ ను డెవలప్ చేసుకున్నాడు. డిపార్ట్ మెంట్ లో ఇతడికి మంచి ఫాలోయింగ్ ఉంది. మనదేశం తరఫున పలు పతకాలు సాధించాడు. అమెరికాలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో మనదేశానికి వెండి పతకం సాధించిన ఇతడు ఇంకా పలు పతకాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

TAGS