Jagan Campaign : అచ్చం కేసీఆర్ లానే జగన్ ప్రచార స్టంట్స్.. వైరల్ వీడియో

Jagan Campaign

Jagan Campaign

Jagan Campaign : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అహంకారంతో విర్రవీగారు. తన గెలపునకు ఎదురులేదని, తనను చూసే జనాలు ఓట్లు వేస్తారని, తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఎమ్మెల్యేలను మార్చకుండానే ఎన్నికలకు వెళ్లారు. నిరుద్యోగుల మాట ఎత్తకుండా, ఉద్యోగుల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్లారు. సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని బలంగా నమ్మారు. వాటితోనే ప్రజల్లోకి వెళ్లారు. చివరకు ఏమైంది కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఇక అప్పటి నుంచి బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించినవారు సైతం ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. పార్టీలోకి వచ్చేవారు లేకపోగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందంటే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకునే పరిస్థితి లేదు. అధికారం ఉంది కదా అని అహంకారంతో విర్రవీగితే.. అధికారం కోల్పోయిన రోజు పరిస్థితి ఎలా ఉంటుందో స్వయంగా అనుభవిస్తున్నారు కేసీఆర్.

ఇక ఏపీలో జగన్ పరిస్థితి సేమ్ టు సేమ్ కేసీఆర్ లాగానే ఉంది. గురువు కేసీఆర్ లాగే ఏపీలో సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని జగన్ భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కన్నా ఎక్కువ వ్యతిరేకత జగన్ పార్టీపైనే ఉందనడంలో సందేహం అక్కర్లేదు. అయినా జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఓటమి తథ్యమని తెలిసినా ప్రగాల్భాలు పలుకుతున్నారు. కేసీఆర్ ఓటమిని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ఆయన్నే అనుసరిస్తున్నారు.

అచ్చం కేసీఆర్ లాగానే ఎన్నికల స్టంట్లను జగన్ చేస్తున్నారు. ఆ స్టంట్లతోనే కేసీఆర్ ఓడిపోయారనే విషయాన్ని మరిచి సేమ్ టు సేమ్ కాపీ కొడుతున్నారు. ప్రచారం కోసం సేమ్ కేసీఆర్ బస్సు లాగానే జగన్ కూడా తన ప్రచార బస్సును డిజైన్ చేశారు. బస్సు వెళ్తుంటే పెయిడ్ ఆర్టిస్టులతో స్టంట్లు కూడా సేమ్ టు సేమ్. వారితో దండాలు పెట్టించినట్టు, వారిని చూసి బస్సు ఆపించడం..లాంటి స్టంట్లన్నీ ఇద్దరివీ సేమ్ టు సేమ్. దీంతో రేపు రిజల్ట్ కూడా సేమ్ టు సేమ్ అని సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. గురువుకు పట్టిన గతే శిష్యుడికి పట్టబోతోందని కామెంట్స్ పెడుతున్నారు.

TAGS