Chandrababu : చంద్రబాబు స్ట్రాటజీలతో జగన్ విలవిల!

Chandrababu

Chandrababu

Chandrababu : ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అడుగడుగునా జగన్ కు చెక్ పెట్టే దిశగా చంద్రబాబు చర్యలు మొదలయ్యాయి. కేంద్రంలోని బీజేపీతో జత కట్టడంతో బాబు తన పనులు సాఫీగా నెరవేర్చుకుంటున్నారు. అధికార యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఎక్కడ కూడా జగన్ కు చాన్స్ ఇవ్వకుండా చేస్తున్నారు. దీంతో ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

జగన్ అధికార మత్తుతో సర్వ వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. ఎన్నికల్లో అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని చూశారు. వలంటీర్లతో రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూశారు. కానీ ప్రతిపక్ష టీడీపీ, జనసేన ఫిర్యాదులతో ఈసీ దిగిరాక తప్పలేదు. వలంటీర్ల సేవలను ఎన్నికల్లో వాడుకోవద్దని సూచించింది.
 

జగన్ కు అనుకూలంగా ఉన్న  ప్రధాన అధికార యంత్రాంగాన్ని కూడా ఈసీ మార్చేస్తుంది. దీంతో జగన్ కు ముచ్చెమటలు పడుతున్నాయి. అధికారానికి దూరం కావాల్సి వస్తుందేమోననే ఆలోచనలో పడిపోతున్నారు. ఇన్నాళ్లు అధికారం ఉంది కదా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఇరకాటంలో పడిపోతున్నారు.

రాబోయే ఎన్నికలు కీలకం కానున్నాయి. జగన్ భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేయనున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఏ సర్వే చూసినా జగన్ అధికారంలోకి రావడం కల్ల అని చెబుతున్నాయి. ఈనేపథ్యంలో జగన్ జంకుతున్నారు. ఎన్నికలయ్యాక పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారం లేకపోతే మనుగడ కష్టమే. ఉనికే ప్రమాదంలో పడుతుందని అనుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం ఖాయమంటున్నారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఐదేళ్లకే అంత స్థాయిలో వారిని భయపెట్టిన జగన్ అంతకు తగిన మూల్యం చెల్లించుకునే సమయం వచ్చింది. ఇక ఎన్నికలయ్యాక జగన్ ఏం చేస్తారనేదే కీలకంగా మారింది. పాత కేసులన్నీ తిరగదోడే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో కేసుల ప్రస్తావన లేకుండా బీజేపీ కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ టీడీపీతో దోస్తీలో ఉన్నందున భవిష్యత్ లో జగన్ కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

TAGS