KCR-Revanth : రేవంత్ ను ఇరుకున పెట్టేలా కేసీఆర్ బిగ్ స్కెచ్

KCR-Revanth

KCR-Revanth

KCR-Revanth : తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకుని గులాబీ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ సీఎం కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. రైతు సమస్యలపైన రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో 14 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా రేవంత్ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో చేరికలు పెరిగాయి. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. అటు బీజేపీ సైతం పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని భావిస్తోంది. అయితే రాష్ట్రంలో తన పార్టీ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయంపై కేసీఆర్ అలర్ట్ అయ్యారు. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారు. కేసీఆర్ పాలనలో చోటు చేసుకున్న అంశాలను రేవంత్ ప్రభుత్వం బయటపెడుతోంది. రాజకీయంగానూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ సమయంలోనే కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే రైతు సమస్యల పైన నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు.

ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 13వ తేదీ నుంచి పర్యటనలకు సిద్ధమయ్యారు. కేసీఆర్ తన పర్యటనను చేవేళ్ల నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ప్రచారంలో బహిరంగ సభల కంటే బస్సు యాత్రలకే ప్రాధాన్యమని భావించినా ఆయన చేవేళ్లలో ప్రచారం చేసి ప్రసంగించనున్నారు. బస్సు యాత్రల ద్వారా కేసీఆర్ ప్రతీ నియోజకవర్గానికి వెళ్లే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు యాత్రల ద్వారా ప్రజలకు దగ్గర కావొచ్చనే నిర్ణయంతోనే ప్రచారానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావన చేస్తారనేది కీలకంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మెజార్టీ సీట్ల సాధన పైనే గురి పెట్టడంతో ఇప్పుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారం.. సీట్ల గెలుపులో ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

TAGS