Sujana Chaudhary : సుజనా చౌదరి గెలుపు సునాయాసమే..విజయవాడ వెస్ట్ లో ‘కమల’ వికాసమే..
Sujana Chaudhary : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ముందుకెళ్తోంది. ఇప్పటికే బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా జనాల్లోకి వెళ్తున్నారు. కూటమికి ఘన విజయం ఖాయమని కూటమి శ్రేణులు భావిస్తున్నాయి. ఇక విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత సుజనా చౌదరి గెలుపు పక్కా అని స్థానికులు చెబుతున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా చూసినా సుజనా చౌదరి గెలుపు నల్లేరుపై నడకే అని తెలుస్తోంది. కులమతాలకు అతీతంగా సుజనా చౌదరికి ఇక్కడి ప్రజల మద్దతు ఉంది. సుజనా చౌదరికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అయితే వైసీపీ అభ్యర్థి మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదనే చెప్పొచ్చు. కూటమి పార్టీల ఓట్ల పోలరైజేషన్ వ్యూహం పాటిస్తుండడంతో సుజనా చౌదరికి అడ్వాంటేజ్ గా మారనుంది.
సుజనా చౌదరి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు. పెద్ద పారిశ్రామికవేత్త, అత్యంత ధనిక రాజకీయవేత్తల్లో ఒకరు. సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ కూడా. చౌదరి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందినవారు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ప్రభుత్వ అధికారుల కుటుంబంలో 1961లో జన్మించిన చౌదరి ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. 1986లో సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీలను స్థాపించారు. 6,000 మంది ఉద్యోగులు $3 బిలియన్ల వార్షిక టర్నోవర్‌తో, డైవర్సిఫైడ్ గ్రూప్ టాప్ 10 కంపెనీల్లో ఒకటి.
1995 -2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సుజనా దగ్గరయ్యారు. పార్టీకి నిధులు సమకూర్చేవారిలో ఒకరిగా పరిగణించబడ్డారు. చంద్రబాబు 2010లో సుజనాను రాజ్యసభ పంపించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా బలమైన టీడీపీ గొంతుకలో చౌదరి ఒకరు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో తన నిరసనతో దృష్టిని ఆకర్షించారు. పార్టీలో మరింత బలపడి టీడీపీ పార్లమెంటరీ విభాగం నాయకుడయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఆర్థిక వనరులను సమీకరించడానికి సుజనా చౌదరిని వనరుల నిర్వహణ కమిటీకి చైర్మన్ గా చంద్రబాబు నియమించారు. కొత్త రాష్ట్ర రాజధాని అభివృద్ధిపై ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్యానెల్ సభ్యుడు కూడా చౌదరి పార్టీలో ప్రాధాన్యం పొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత మరో ఇద్దరితో కలిసి బీజేపీలో చేరారు. ఎన్డీఏ ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు.
కాగా, తాజా ఎన్నికల్లో ఆయన ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నరేంద్ర మోదీ ఆశీస్సులతో పాటు చంద్రబాబు, పవన్ ల చరిష్మా, నియోజకవర్గ అభివృద్ధిపై సుజనాకు ఉన్న కమిట్ మెంట్ లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆర్థికంగానే కాదు సామాజిక సేవలోనూ, తన మంచి మనస్సు ను చాటుకునే సుజనా బరిలో ఉండడంతో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి కంటి మీద కునుకు ఉండడం లేదంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అయ్యిందని, సుజనా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని స్థానికులు అంటున్నారు. అలాగే కృష్ణా జిల్లాలో సుజనాకు మంచి పట్టు ఉంది. కమ్మ సామాజిక వర్గం సుజనా చౌదరిని ఓన్ చేసుకున్నట్లుగా మరే ఇతర నేతను ఓన్ చేసుకోలేదనే చెప్పొచ్చు. సుజనా పోటీతో విజయవాడ పశ్చిమ స్థానాన్ని బీజేపీ గెలుచుకోవడం పక్కా అని విశ్లేషకులు అంటున్నారు.