Viral Video : పెట్రోల్ పోసుకున్న వెంటనే బండి స్టార్ట్ చేయొద్దు..ఈ వీడియో చూడండి వణికిపోతారు..
Viral Video : ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్తే ఎండలు, ఇంట్లో ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తీవ్రమైన వడగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7గంటల నుంచే ఎండ దంచుతుండడంతో బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఈసారి ఎండలు తీవ్రంగా ఉండబోతున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.
వేసవిలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదం కొని తెచ్చుకుంటారు. సిగరెట్ తాగి బయట పడేస్తుంటారు. దీంతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ఎండ తీవ్రత బాగా ఉండడంతో చిన్న నిప్పు రవ్వ కూడా పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఇక ఇండ్లలో, ఆఫీసుల్లో కరెంట్ వాడకం అధికమై షార్ట్ సర్క్యూట్ కావడం, ఎండ వేడిమికి ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోవడం జరుగుతుంటుంది. ఎండా కాలంలో ఇలా ఎన్నో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక బైక్ లు, కార్లు..వంటి వాహనాలు వాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించారు. బయట ఎండలో పెట్టడం వల్ల పెట్రోల్, డీజిల్ ఆవిరి అవుతుంటుంది. అలాగే ఎక్కువసేపు ఎండలు ఉండడం వల్ల వాహనాల్లోని పెట్రోల్ మండిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి వాటిపై జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రమాదానికి గురికాకుండా ఉండగలుగుతాం.
కాగా, చాలా మంది టూ వీలర్లపై ఎండలో ప్రయాణించి పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకులకు వెళ్తుంటారు. బండిలో పెట్రోల్ పోయించుకుని వెంటనే స్టార్ట్ చేస్తారు. ఇలాంటప్పుడు బండిలోని పెట్రోల్ అధిక వేడికి మండిపోయే అవకాశం ఉంటుంది. దీంతో బండి అంటుకోవడమే కాదు పెట్రోల్ బంకులో ఉంటాం కాబట్టి భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. బండ్లు ఎండలో తిరగడం వల్ల ఇంజిన్ బాగా హీటెక్కి ఉంటుంది..పెట్రోల్ పోసి వెంటనే స్టార్ట్ చేయడం వల్ల ఒకేసారి స్పార్క్ వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎండలో బైక్ పై తిరిగి వచ్చి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించకుంటాడు. వెంటనే స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా బండి ఇంజిన్ లో మంటలు వ్యాపించి ఒక్క క్షణంలోనే బండి, బండితో పాటు ఆ వ్యక్తి మండిపోవడం ఆ వీడియోలో చూస్తాం. ఆ మంటలు పెట్రోల్ బంక్ లోకి వ్యాపించి పెను ప్రమాదం జరిగింది.
అందుకే ఎండలో ప్రయాణించి పెట్రోల్ పోసుకున్న తర్వాత కొంచెం దూరం వెళ్లిన తర్వాతనే బండి స్టార్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఎండాకాలంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటేనే సురక్షితంగా ఉంటామని వారు చెబుతున్నారు.