NATS Diwali Gifts : ‘నాట్స్’ దీపావళి కానుకలు..
NATS Diwali Gifts : ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS). ఉత్తర అమెరికాలోని నివసిస్తున్న తెలుగు ప్రజల దైనందన జీవితం. అవి అవసరాలను తీర్చేందుకు ఈ సంఘం పని చేస్తుంది. ఈ సంఘం ఆధ్వర్యంలో అమెరికాలో ఉన్న తెలుగు కమ్యూనిటీకి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన సేవలను అందిస్తుంది.
ఇటీవల దీపావళి వేడుకలు చికాగో, ఇలినాయిస్ లో ఘనంగా జరిగాయి. చికాగోలో ఉంటున్న తెలుగు వారి కోసం ‘నాట్స్’ కానుకలు పంపించింది. దాదాపు 300 వరకు తెలుగు కుటుంబాలకు నాట్స్ చికాగో యూనిట్ ఇంటింటికీ వెళ్లి కానుకలు అందించింది. దీపావళి రోజు ప్రతీ తెలుగు కుటుంబం ఆనందంగా ఉండాలని నాట్స్ (NATS) ఈ కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది.
చాప్టర్ నాయకులు హరీష్ జమ్ముల, బిందు వీధులమూడి, రోజా శీలంశెట్టి, నరేంద్ర కడియాల, వినోద్, మనోహర్ పాములపాటి, అంజయ్య వేలూరు, సునీల్ ఆకులూరి, వీర తక్కెళ్లపాటి, భారతి పుట్ట, నరేష్ యాద తదితరులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మూర్తి కొప్పాక, శ్రీని అరసడ, శ్రీని బొప్పన, రవి శ్రీకాకుళం తో పాటు కార్యవర్గ సభ్యులు మదన్ పాములపాటి, ఆర్ కే బాలినేని, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మి బొజ్జ మార్గ నిర్ధేశనం చేశారు.
ఈ కానుకల కోసం నాట్స్ నిధుల నుంచి కొంత వినియోగించగా.. మరికొంత దాతల నుంచి నేరుగా అందింది. వారందరికీ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి కృతజ్ఞతలు తెలిపారు. చికాగో నాట్స్ చాప్టర్ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు చైర్ పర్సన్ అరుణ గంటి యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించింది.