Pedakurapadu : పెదకూరపాడులో సామాన్యుల అభిప్రాయం ఇదీ
Pedakurapadu : పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజలు పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలించేందుకు అనర్హుడంటూ పేర్కొంటున్నారు. పేదల కష్టాలు ఏ మాత్రం పరిష్కరించలేని సీఎం ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న (ఏప్రిల్ 06) పెదకూరపాడులో టీడీపీ అధినేత, మహా కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. నియోజకవర్గంలోని సమస్యలను వివరిస్తూ భాష్యంతో.. దాస్యం పోతుందని హామీ ఇచ్చారు. నంబూరు శంకర్ కంటే భాష్యం అన్ని విధాలా యోగ్యుడని చెప్పిన చంద్రబాబు తనతో పాటు అసెంబ్లీకి పంపించాలని నియోజకవర్గం ప్రజలను కోరారు. దీంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. నియోజకవర్గానికి నిధులు తెచ్చే నేత భాష్యం మాత్రమే అని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు.
బాబు రోడ్ షో తర్వాత భాష్యంకు నియోజకవర్గంలో మరింత ఆదరణ పెరిగింది. మొదటి నుంచి నియోజకవర్గం యూత్ అతని వైపునే ఉండగా.. రోడ్ షోతో మరింత ఉత్సాహంగా పని చేసేందుకు సిద్ధం అయ్యారు. వారే స్వయంగా భాష్యంకు ఫోన్ చేసి మరీ గ్రామలు, మండలాలు, వీధుల బాధ్యతలు తీసుకుంటామని చెప్తున్నారు. నియోజకవర్గంలో వచ్చిన పెను మార్పుతో భాష్యం గెలుపుపై మరింత ధీమా పెరిగింది.
‘జై స్వరాజ్య టీవీ’ సామాన్యులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించింది. భాష్యంకు మద్దుతుగా నిలుస్తామని చెప్తున్న వారు భాష్యం ప్రవీణ్ విజన్ ఉన్న వ్యక్తి అంటున్నారు. ఆయనను అసెంబ్లీకి పంపించడం ఖాయం అంటున్నారు. చంద్రబాబు నాయుడి హయాంలో మాత్రమే అభివృద్ధి అనేది కనిపిస్తుందని, వైఎస్ జగన్ హయాంలో ఎటువంటి అభివృద్ధి లేదని వాపోతున్నారు. గతంలో బాబు ఓటమి పాలైతే రాష్ట్రం సమూలంగా నాశనమైందని వాపోయారు. తెలుగుదేశం ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటున్న పెదకూరపాడు ప్రజలు భాష్యంను అసెంబ్లీకి పంపించడం ఖాయం అంటు చెప్తున్నారు.