Congress : ఆ మూడింటిపై పీటముడి..కాంగ్రెస్ ఎప్పుడు తేల్చుతుందో?

Congress

Congress

Congress : కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. 17 స్థానాలకు గాను 14 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసింది. కరీంనగర్, ఖమ్మం స్థానాలను మాత్రం పెండింగ్ లో పెట్టింది. ఖమ్మం స్థానాన్ని తన భార్యకు కేటాయించాలని భట్టి విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడికి ఇవ్వాలని పట్టుబడుతుండటంతో వ్యవహారం రసకందాయకంలో పడుతోంది.

వీరికి కాకుండా రామసహాయం రఘురాంరెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం చూస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ లోక్ సభ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. టికెట్ రేసులో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న ఉండగా ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్ పొన్నం ప్రభాకర్ కు త్యాగం చేయడంతో ఆయనకే ఇవ్వాలని చూస్తున్నారు. ఖమ్మంలో ఓసీకి ఇస్తే కరీంనగర్ లో బీసీకి ఇవ్వాలని భావిస్తోంది.

పొంగులేటి, భట్టి పట్టు వీడకపోవడంతో రఘురాంరెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పొంగులేటి కుమార్తెను రఘురాంరెడ్డి చిన్న కుమారుడికి ఇచ్చారు. పెద్ద కుమారుడు హీరో వెంకటేష్ కుమార్తెను చేసుకున్నారు. దీంతో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కలిసి వస్తాయని అనుకుంటున్నారు. భట్టి మాత్రం తన భార్యకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

కరీంనగర్ లో బీజేపీ నుంచి బండి సంజయ్ బరిలో నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ బోయినపల్లి వినోద్ కుమార్ ను నిలిపింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఇంతవరకు అభ్యర్థి ఎంపిక వాయిదా పడుతోంది. బండిని తట్టుకుని నిలిచే అభ్యర్థి కోసం వేట సాగిస్తున్నారు. హైదరాబాద్ లో ఫిరోజ్ ఖాన్ కు లేదా మరో నేతలకు టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

దీంతో కాంగ్రెస్ ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. గెలిచే సత్తా ఉన్న వారినే ఎంపిక చేయాలని చూస్తోందని తెలుస్తోంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ఎంపిక చేసే అభ్యర్థి ప్రత్యర్థులను తట్టుకుని నిలుస్తాడా? లేదా అనే అనుమానాలు వస్తున్నాయి.

TAGS