Vijay Devarakonda : ఆ సినిమా వల్ల నాకు నేను శిక్ష విధించుకున్నా.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు

Vijay Devarakonda

Vijay Devarakonda

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు పరశురామ్. గీతగోవిందం తర్వాత విజయ్, పరుశురామ్ కాంబోలో వస్తున్న మూవీ ఇది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ తోనే కుటుంబ ప్రేక్షకులకు గాలం వేశారు. ఫ్యామిలీ అంతా థియేటర్లకు  వెళ్లే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. పైగా సమ్మర్ సీజన్. కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమాకు మించిన ఆప్షన్ మరేది లేదు. విజయ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, ఈ సినిమా దుమ్మురేపడం మాత్రం ఖాయం. మృణాల్ టైం ఓ రేంజ్ లో ఉంది. తన సినిమాలన్నీ హిట్టే. లేటెస్ట్ గా వచ్చిన హాయ్ నాన్న తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఎలా చూసుకున్నా ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ వైబ్స్ కనపడుతున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈనేపథ్యంలో విజయ్ ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తాను నటించిన ‘లైగర్’ మూవీ ఫెయిల్యూర్ స్పందించారు.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన లైగర్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. అప్పట్లో విజయ్ మాటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘లైగర్ కు ముందు.. తర్వాత నా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. సినిమా విడుదలకు ముందే దాని ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా.. నాటి నుంచి అదే అమలు చేస్తున్నా.. ఇది నాకు నేనే విధించుకున్న శిక్ష’’ అని అన్నారు.

ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి మాట్లాడుతూ.. మనకు ఏ కష్టం వచ్చినా ధైర్యం చెప్పే వ్యక్తి ప్రతి కుటుంబంలో ఉంటాడని, ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్ అని చెప్పారు. తన కుటుంబంలో వాళ్ల నాన్నే ఫ్యామిలీ స్టార్ అని తెలిపారు. పరశురామ్ ఈ కథ చెప్పగానే తమ నాన్నే గుర్తుకొచ్చాడని, అందుకే తన పాత్రకు ఆయన పేరే పెట్టామని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆ పేరు పెట్టుకుంటేనే ఎమోషన్స్ పలికించడం ఈజీ అవుతుందని పేర్కొన్నారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని హామీ ఇచ్చారు విజయ్. కాగా, ఈమూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించారు. పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

TAGS