Bhashyam Praveen : టీడీపీ ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రచారానికి విశేష స్పందన.. టీడీపీలోకి 50 కుటుంబాలు..!
Bhashyam Praveen : పెదకూరపాడు ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ లేమల్లె గ్రామంలో పర్యటించారు. మొదట గ్రామం లోని పార్టీ టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. వైసీపీ నుండి వచ్చిన 50 కుటుంబాల నేతలను టీడీపీ ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఎంపీ లావు కృష్ణదేవరాయల తో కలిసి ఆయన లేమల్లె గ్రామం లో పర్యటించారు. పెదకూరపాడు ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం ఎంపీ లావు కృష్ణదేవరా య లు ఆయనతో కలిసి ప్రచారం నిర్వహించ డం తోపాటు సమావేశాల్లో పాల్గొన్నారు. తెలుగు దేశం పార్టీకి విశేష మైనటువంటి స్పందన లభిస్తుందని టిడిపి ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా సాదర స్వాగతం లభిస్తోందని ఆయన అన్నారు.
లేమల్లె గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలను నాయ కులు తమ దృష్టికి తీసుకొచ్చారని అధికా రంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలను పరిష్కరిస్తానని భాష్యం ప్రవీణ్ తెలిపారు. ఎంపీ లావు కృష్ణదేవరా యలు మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి అయిన భాష్యం ప్రవీణ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించా లని నాయకులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలు గుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తేనే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని ఎంపీ లావు అన్నా రు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే కూట మి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరు సమిష్టి గా పనిచేసి కూటమి గెలుపుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ లావు తెలిపారు.