Pedakurapadu Constituency : పెదకూరపాడు రివ్యూ : టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ దే గెలుపు
నియోజకవర్గం : పెదకూరపాడు..
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే : నంబూరు శంకర్ రావు
టీడీపీ (కూటమి ): భాష్యం ప్రవీణ్
Pedakurapadu Constituency Review : ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఉన్న నియోజకవర్గం పెదకూరపాడు. డీలిమిటేషన్ ఆర్డర్ 1995లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 222,675 (2021) ఉన్నారు. ఇందులో ఐదు మండలాలు ఉన్నాయి. 1. బెల్లంకొండ, 2. అచ్చంపేట, 3. క్రోసూరు, 4. అమరావతి, 5. పెదకూరపాడు.
ప్రధాన పార్టీలు
పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం నెం. 85గా ఉంది. అయితే ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు ఢీ కొనబోతున్నాయి. ఒకటి అధికార పార్టీ అయిన వైసీపీ, రెండోది మహా కూటమిలో ఉన్న టీడీపీ. పెదకూరపాడు నియోజవకర్గం 2021లో వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఎలాగైనా ఆ నియోజకవర్గంను దక్కించుకోవాలని అందుకు గట్టి నాయకుడి కోసం అన్వేషించింది. సత్తా ఉన్న నాయకుడిగి భాష్యం ప్రవీణ్ ను టీడీపీ తరుఫున మహాకూటమి రంగంలోకి దించింది.
బలాలు, బలహీనతలు
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు
పెదకూరపాడులో 2021లో వైసీపీ తరుఫున తెరపైకి వచ్చిన నేత నంబూరు శంకర్ రావు. ఫ్యాన్ గాలి బాగా వీస్తున్న సమయంలోనే ఆయన గెలుపొందారు. ఆయనకు పెద్దగా పలుకుబడి లేకున్నా హవాలో విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు ఆ సందర్భంలో చెప్పుకచ్చారు. అయితే.. ఈ సారి మహా కూటమి రంగంలోకి దిగనుండడంతో ఎదుర్కొనడం కష్టమేనన్న వాదనలు వినిపిస్తు్న్నాయి. గతంలో చేపడతానన్న పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో కొంతలో కొంత వ్యతిరేకత అయితే ఉందని తెలుస్తోంది. ఆర్థికంగా బలమైన నేత రంగంలోకి దిగితే ఎదుర్కోవడం కొంచెం కష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
భాష్యం ప్రవీణ్
గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలకు సుపరిచితుడు భాష్యం ప్రవీణ్. అధినేత చంద్రబాబు 34 మందితో వెలువరిచిన రెండో జాబితాలో భాష్యం ప్రవీణ్ కు సీటు దక్కింది. జిల్లాలోనే కాదు ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి ఉన్న కీలక నియోజకవర్గం అయిన పెదకూరపాడు సీటు దక్కించుకున్న భాష్యం ప్రవీణ్ పేరు ఏపీ అంతటా మార్మోగిపోతోంది.
గుంటూరు జిల్లాలోని సీనియర్ నేతలు, రాజకీయ ఉద్దండులతో పాటు సీటు దక్కించుకున్న ప్రవీణ్ ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ లీడర్ గా తెరమీదకు వచ్చారు. స్థానికంగా ఉన్న యూత్ లో ఈయనకు మంచి సంబంధాలు ఉండడం కూడా కలిసి రానుంది.
‘భాష్యం’ విద్యాసంస్థల అధినేతకు ప్రవీణ్ బంధువు. పలు వ్యాపారాల్లో కూడా ప్రవీణ్ పెట్టుబడులు పెట్టారు. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు. ఐదేండ్ల నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. దీనికి తోడు చంద్రబాబు హామీ తో రెండేళ్లుగా నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్నారు. ఇటు టీడీపీలో కూడా చాలా వేగంగా ఎదగడంతో పాటు చంద్రబాబు లోకేశ్ దగ్గర మంచి మార్కులు వేయించుకున్నారు.
జిల్లాలో యువగళం నిర్వహించినప్పుడు ప్రవీణ్.. సర్వం తానే అయి వ్యవహరించారు. పార్టీ కార్యకర్తల సహాయనిధికి కూడా రూ.73 లక్షల విరాళం అందించారు. ఇవన్నీ నారా లోకేశ్ ను ఆకట్టుకున్నాయి. ఈక్రమంలోనే గట్టి పోటీ ఉన్న నియోజకవర్గం నుంచి సీటు దక్కించుకోగలిగారు. యువతను, పేదలను ఆకట్టుకోవడంలో ప్రవీణ్ ముందుంటారు. అదే ఇప్పుడు ఆయనకు బోనస్ కానుంది. ప్రస్తుతం పెదకూరపాడు టికెట్ కేటాయించడంతో భాష్యం ప్రవీణ్ పొలిటికల్ జర్నీ సక్సెస్ ఫుల్ గా ప్రారంభంకానుంది. ఈ స్థానం నుంచి భాష్యం ప్రవీణ్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని అక్కడి ప్రజల నాడీని బట్టి తెలుస్తోంది.