UPI Users Alert : యూపీఐ యూజర్లకు షాక్.. ఇక అవి పని చేయవు..
UPI Users Alert : ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. చిన్న చిన్న వ్యాపార సంస్థల నుంచి మొదలుకొని పెద్ద స్థాయి వరకు అంతా డిజిటల్ పేమెంట్స్ నడుస్తున్నాయి. ఇక నోట్లు నేరుగా తీసుకోవడం చాలా వరకు తగ్గించేశారు. అయితే తాజాగా యూపీఐ యూజర్లకు ఓ భారీ హెచ్చరిక ఒకటి వచ్చేంది. మన దేశంలో యూపీఐ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ చూసుకుంటున్నది. అయితే సేవలను అందిస్తున్న గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, క్రెడ్ లాంటి థర్డ్ యాప్స్ కి కీలక సర్క్యులర్ జారీ చేసింది. తాజా సూచన ప్రకారం ఇకపై దేశంలో ఏడాది పాటు వినియోగంలో లేని యూపీఐ ఐడీలను ఇక డియాక్టివేట్ చేయనున్నారు.
అయితే ఖాతాదారులు తమ పాత నంబర్ ను బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తొలగించకుండా వారి మొబైల్ నంబర్ నుమార్చుకున్నట్లతే ఆ పాత నంబర్ కు నగదు పంపకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఓ కేసులో సుప్రీం ఆదేశాల నేపథ్యంలో వినియోగదారుల పేమెంట్స్ భద్రత లో భాగంగా నేషనల్ పేమంట్స్ సర్వీసెస్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్పీసీఐ తాజా ఆదేశాల డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వస్తాయి. ఇదే క్రమంలో ఇక బ్యాంకులు ఏడాది పాటు ఎలాంటి ట్రాన్సక్షన్లు చేయని బ్యాంకుల యూపీఐ ఐడీలను గుర్తించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో వినియోగదారుల పేమెంట్స్, లావాదేవీల భద్రత కోసం మరిన్ని సురక్షిత పద్ధుతులు అవలంబిస్తామని చెబుతున్నది. ఇక కొత్త నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ యాప్స్ పే టు కాంటాక్ట్, పే టూ మొబైల్ నంబర్ ప్రారంభించే ముందు రిక్వెస్టర్ వాలిడేషన్ కూడా నిర్వహిస్తాయి. ఇదంతా వినియోగదారుల మేలు కోసమేనని ఎన్పీసీఐ స్పష్టం చేస్తున్నది.