Pawan Kalyan : సత్తాచాటాల్సిన సమయం అసన్నం.. పవన్ టాప్ గేర్ వేయాల్సిందే..
Pawan Kalyan : పవన్ పార్టీ దాదాపు పదేళ్లు అవుతోంది. గత ఎన్నికల్లో పార్టీకి సంస్థాగత నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ఈసారి ఎన్నికల్లో సత్తాచాటడమే లక్ష్యంగా జనసేనాని ముందుకెళ్తున్నారు. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీని తీసుకురావడంలో పవన్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిలోకి రావడం బాగా లాభిస్తుందనే చెప్పాలి. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పవన్ వ్యూహాలు రచిస్తున్నారు.
పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అటు పార్లమెంట్ స్థానాలు, ఇటు అసెంబ్లీ స్థానాలు మొత్తం 23 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకోవడానికి పవన్ తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే జనసేన అభ్యర్థులు గెలవడంతో పాటు కూటమి అభ్యర్థులు కూడా విజయం సాధిస్తారు.
అన్నింటికీ మించి పవన్ తన నాయకత్వ పటిమను ప్రదర్శించాల్సిన అవసరముంది. విమర్శకుల నోళ్లు మూయించాలంటే పవన్ ఈ ఎన్నికల్లో కచ్చితంగా సత్తాచాటాల్సిన అవసరముంది. సరైన విజయం దక్కకుంటే శ్రేణుల్లో అభ్రదతా భావం వస్తుంది. జనసేనను ఇబ్బంది పెట్టేందుకు ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తాయి. అందుకే జీవన్మరణ సమస్యలాంటి ఈ ఎన్నికలను పవన్ ఎలా ఎదుర్కొంటారోనని సర్వత్రా ఆసక్తి అయితే ఉంది.