Hit Movies : ఈ సినిమాలతో సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామనుకున్నారు? మంచి కంటే చెడే ఎక్కువ.. 10 హిట్ సినిమాలు..!
Hit Movies : 80sలో సినిమాలు మూస ధోరణిలో ఉండేవి. హీరోలు అంటే మంచి పనులు చేసేవారు. విలన్లు అంటే చెడు పనులు చేసేవారు. ఇద్దరి మధ్య ఫైట్.. కట్ చేస్తే హీరో విన్.. కానీ, రాను రాను జమానా మారింది. హీరోలు విలన్ల పాత్రను విలన్లు హీరోల పాత్రలో నటిస్తున్నారు. కానీ, స్టార్ యాక్టర్లే హీరోలు.. విలన్లు ఎప్పుడూ విలన్లే..
ఇప్పటి సినిమాలు అన్యాయం వైపు ఉన్న వారిని హీరోలుగా.. అదే అన్యాయాన్ని అడ్డుకుంటున్న వారిని విలన్లుగా చూపిస్తుంది. ఇక సినిమాలను చూసే ప్రేక్షకులు వారిని అనుకరిస్తే సమాజం ఎలా మారుతుంది. ఒకవైపు అద్భుత చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతి ఖండాంతరాలకు పాకుతుంటే ఇటువంటి సినిమాలు దాని ఖ్యాతిని పాతాళానికి తీసుకెళ్తాయి. అయితే, వాటిలో చాలా వరకు హిట్ టాక్ తెచ్చుకున్నవే.. ఆ సినిమాలేంటో చూద్దాం.
1. ఇడియట్
అమ్మాయి మనోభావాలతో సంబంధం లేకుండా హీరోయిన్ ను తెగ ఇబ్బంది పెట్టిన లవ్ స్టోరీ. లవ్ చేయాలి.. కౌగిలించుకో.. ముద్దు పెట్టుకో.. అలా.. ఇలా.. అంటూ హీరోయిన్ ను తెగ వేధించిన సినిమా. ఈ సినిమా సమయంలో యూత్ ఇదే ట్రెండ్ గా ఫాలో అయ్యారు.
2. పోకిరి
ఈ సినిమా ఎంతటి బక్సాఫీస్ హీట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీనే మార్చిన సినిమా. ఈ సినిమా సమయంలో యంగ్ జనరేషన్ పై పెద్ద ప్రభావం చూపించింది. ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణ మనోహర్ ను చూసి నేర్చుకుందామని అనుకోకుండా.. పండు గాడిని చూసి ఇలా ఉండాలి అనుకున్నారు యూత్.
3. చిత్రం
కాలేజ్ పూర్తవకముందే.. లైఫ్ లో సెటిల్ కాక ముందే ఒక బిడ్డకు తల్లిదండ్రులుగా మారితే ఎలా ఉంటుంది. అదే మెసేజ్ తో వచ్చిన సినిమా.. డైరెక్టర్ ఏం అనుకున్నాడో ఏంటో.. ఇది చాలా ఎబ్బెట్టుగా మారింది.
4 ఖతర్నాక్
తల్లీ, తండ్రి, తర్వాత స్థానం గురువుదే. కానీ ఈ సినిమా వారి మధ్య ఉన్న గురుశిష్య బంధంను మరోలా తీసుకెళ్లింది. సంప్రదాయానికి పూర్తిగా వ్యతిరేకంగా తీశారు.
5 అర్జున్ రెడ్డి
ఈ మూవీ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో హీరో పాత్ర హీరోయిన్ తో ప్రవర్తించే విధానం సరిగా ఉండవు. పైగా యూత్ ను బాగా అట్రాక్ట్ చేసే కథ.. కథనం.. చాలా కాంట్రవర్సీలను క్రియేట్ చేసింది ఈ మూవీ.
6 నేను లోకల్
ఒక అమ్మాయిని ప్రేమించిన యువకుడు అమ్మాయి తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం పోలీస్ ఆఫీసర్ గా తిరిగివస్తాడు. ఈ సినిమాలో అతడు విలన్.. అదే కనీసం డిగ్రీ కూడా పాస్ కాని వ్యక్తి అమ్మాయిని మొదట్లో వేధించడం, ఆమె తండ్రిని అవమానించడం చేసి, చివరికి ఆమె మనసును గెలుచుకొని పెళ్లి చేసుకుంటాడు. ఈ సినిమా హిట్ అయ్యింది.
7 హార్ట్ ఎటాక్
అమ్మాయిని ప్రేమిస్తున్నా.. ఎప్పటికీ నీతోనే ఉంటా.. లాంటివి చెప్పకుండా నువ్వు ఒక్క ముద్దు ఇస్తే చాలు.. ఇంకేం వద్దు అని చెప్తాడు హీరో.. ఇదే హీరోయిజం ఈ సినిమాలో.
8 ఆర్ఎక్స్ 100
ఒక మగాడు నచ్చితే యువతి చేసే దుర్మార్గాలు అంతా.. ఇంతా.. కావు. ఇదే సందేసం ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. చివరికి ఆమె తండ్రే ఆమెను చీదరించుకోవడం.. దీంతో ప్రతీ ఆడపిల్ల గురించి ఆలోచించే ధోరణే మారిపోయింది.
9 ఉప్పెన
జీవితం అంటే తెలియని ఒక అమ్మాయి.. పేద వ్యక్తి దగ్గర దొరికిన స్వేచ్ఛను ప్రేమ అనుకుంటుంది. దాని కోసం అతనితోనే ఉండేందుకు సిద్ధపడుతుంది. సముద్రంలో అతనితో శారీరకంగా కలుస్తుంది.
10 పుష్ప
ఈ చిత్రంలో ఒక స్మగ్లరే హీరో. అతన్ని అడ్డుకొనే పోలీసులే విలన్లు. ఆ హీరో మ్యానరిజాలను అనుకరిస్తూ అభిమానిస్తున్నారు ప్రేక్షకులు.