Rohith sharma : కేప్టెన్సీ లేకపోవడం రోహిత్ కే ప్లస్ కానుందా?

Rohith sharma

Rohith sharma

Rohith sharma : 2024 ఐపీఎల్ ఈ సారి ఎన్నో మార్పులను మోసుకచ్చింది. లెజండరీ ప్లేయర్స్ ఎంఎస్ ధోనీ, విరాట్, రోహిత్ కేవలం బ్యాటర్స్ గా మాత్రమే బరిలోకి దిగుతున్నారు. RCB కేప్టెన్సీ నుంచి కింగ్ కొహ్లీ తప్పుకున్నాడు. ఈ సీజన్ ప్రారంభానికి ఒక్క రోజు ముందే కేప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ నిష్క్రమించాడు. తన స్థానంలో యంగ్ బ్యాట్స్ మన్ రుతురాజ్ గైక్వాడ్ కేప్టెన్ బాధ్యతలు తీసుకుంటున్నాడని మహీనే స్వయంగ ప్రకటించారు.

అయితే, ఈ విషయంలో కొహ్లీ, ధోని కంటే రోహిత్ ది కాస్త డిఫరెంట్ స్టోరీ. గతేడాది వరకు జరిగిన మొత్తం 16 సీజన్ లలో టీమ్ కు 5 ట్రోఫీలు అందించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కేప్టెన్సీ నుంచి తప్పించింది ముంబై యాజమాన్యం. ఈ అనూహ్య మార్పు అటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తో పటు ఇటు టీమిండియా ఫ్యాన్స్ ను కూడా బాధించింది. కానీ కేప్టెన్సీ పోవడం ఆయనకే ప్లస్ పాయింట్ అయ్యింది.

ఈ ఏడాది (2023) వరల్డ్ కప్ జరిగింది. అప్పుడు కేప్టెన్ గా, బ్యాట్స్ మన్ గా చేశాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఐపీఎల్ కూడా 45 రోజుల వరకు ఉంటుంది. ఇందులో కూడా కేప్టెన్ గా, బ్యాట్స్ మన్ గా బిజీ అయిపోయేవాడు. మ్యాచుల టైమ్లో సీరియస్గా, అప్పుడప్పుడూ ఫ్రస్టేషన్ తో కనిపించేవాడు రోహిత్. గెలవాలనే ప్రెజర్ వల్లనేమో కానీ రోహిత్ ముఖంలో నవ్వే కనిపించేది కాదు. టైట్ షెడ్యూల్తో శారీరకంగా, మానసికంగా అలసిపోయేవాడు.

కానీ, ఇప్పుడు కేప్టెన్సీ భారం పోవడంతో కొంత మార్పు కనిపిస్తోంది. ప్రాక్టీస్ సెషన్స్లో రోహిత్ ఒక్కడే సాధన చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యాతో వివాదం నేపథ్యంలో పెద్దగా టీమ్ తో కలవడం లేదు. బుమ్రా లాంటి ఒకరిద్దరు సీనియర్లతో మాత్రమే కలిసి ఉంటున్నాడు.

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయాల్సిందిగా రోహిత్ను ఆదేశించాడు కేప్టెన్ హార్దిక్. కూల్గా ఓకే చెప్పి ఫీల్డింగ్ చేశాడు హిట్ మ్యాన్. హార్దిక్ కు రోహిత్ నో చెబితే కాంట్రవర్సీ అయ్యేది. కానీ వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్న రోహిత్ కూల్గా కేప్టెన్ చెప్పిన పని చేసుకుంటున్నాడు. కెప్టెన్సీ బర్డెన్ కూడా పోవడంతో బ్యాట్తో చెలరేగిపోతున్నాడు. స్వేచ్ఛగా షాట్లు కొడుతూ డేంజరస్గా కనిపించాడు.

ఇక నిన్న (మార్చి 25) జరిగిన హోలీ వేడుకలో రంగులు చల్లుకుంటూ చిల్ అయ్యాడు. హిట్ మ్యాన్ ను చాలా కాలం తర్వాత ఇలా చూస్తున్నామని తన ఫ్యాన్స్ చిల్ అవుతున్నారు. ముంబై ఇండియన్స్ కేప్టెన్ నుంచి తొలగించడం తనకు బిగ్ ప్లస్ అని.. తనకు తాను రీఫ్రెష్ అయ్యేందుకు ఇది ఎంతో ప్లస్ అవుతుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

TAGS