Maldives President : భారత్ ను వేడుకుంటున్న మాల్దీవుల ప్రెసిడెంట్ మొయిజ్జు..
Maldives President : మాల్దీవులకు ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పటి నుంచి మొయిజ్జు స్వరంలో మార్పు వచ్చింది. భారత్ తో అంటీ ముట్టనట్లు ఉండడంతో పాటు చైనాను మాల్దీవులకు తీసుకువచ్చి ఏదో సాదిద్ధామని కలలు కన్నాడు. భారత్ ను కాదనుకుంటే చిప్పే గతవుతుందని మెల్ల మెల్లగా తెలుసుకుంటున్నాడు. చైనా వెళ్లి వచ్చిన మొయిజ్జు.. మాల్దీవుల్లో భారత్ సైతం వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేసిన దేశాధినేత. మాకు ఎన్నటికీ మిత్ర దేశం భారతే అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇదంతా ఎందుకోసమే భారత్ కు కూడా తెలుసు. ప్రపంచమే శాంతిగా స్వేచ్ఛగా ఉండాలనుకునే భారత్ పొరుగు దేశ వాసులను బానిసలుగా చూడదని మొయిజ్జు తెలుసుకున్నాక బాధపడతాడని విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా పక్కన ఉంచితే..
భారత్ నుంచి రుణ విముక్తి కోరుకుంటున్నట్లు మొయిజ్జు చెప్తున్నారు. గతే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మాల్దీవులు భారత్ కు దాదాపు 400.9 మిలియన్ డాలర్లు బకాయిపడింది. ఈ బకాయిని చెల్లించడంలో ఉపశమనం కలిగించాలని ద్వీప దేశం ప్రాధేయపడుతోంది. నవంబర్, 2023లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మొయిజ్జు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మే 10వ తేదీ నాటికి భారత బలగాలు తమ దేశాన్ని వీడి వెళ్లిపోవాలని గడువు విధించిన మొయిజ్జు చేసిన తాజా వ్యాఖ్యలపై ప్రపంచం చర్చించుకుంటుంది.
అధ్యక్షుడిగా ఎన్నికైన ముయిజ్జు తొలిసారిగా గురువారం (మార్చి 21) మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించాడు. మాల్దీవులకు సాయం చేయడంలో భారత్ ఎందో ఉదాసీనంగా వ్యవహరించిందని, పెద్ద మొత్తంలో ప్రాజెక్టులు నిర్మించిందని కొనియాడారు. ఇరుదేశాల మధ్య స్నేహం కొనసాగుతుందన్నారు.
‘మాల్దీవుల గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం భారత్ నుంచి తీసుకున్న అప్పులు భారీగా పేరుకుపోయాయి. వాటిని తిరిగి చెల్లించడంలో మినహాయింపు కోరుతూ భారత్ తో చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టుకు విఘాతం కలిగించం. త్వరగా వాటిని పూర్తి చేసేందుకు సహకరిస్తాం’ అని మొయిజ్జు పేర్కొన్నారు. దుబాయి వేదికగా జరిగిన ‘కాప్ 28’ సదస్సులో భారత ప్రధాని మోడీతో ఇదే విషయంపై ప్రస్తావించినట్లు తెలిపారు. భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముయిజ్జు వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
భారత్ చాలా సందర్భాల్లో ద్వీప దేశాన్ని ఆదుకుంది. శత్రుమూకలు వచ్చినప్పుడు సైనికులను పంపింది. ప్రస్తుతం అక్కడ అత్యవసర వైద్య సేవలు అందిస్తోంది. మాల్దీవుల్లో మన దేశ నావికాదళానికి చెందిన 2 హెలి కాప్టర్లు, డోర్నియర్ విమానం ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి. భారత్ కు చెందిన 80 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. ఐదేళ్లలో అత్యవసర చికిత్స కోసం సుమారు 600 మందిని వారు భారత్కు తరలించారు.
భారత్తో సంబంధాలు రోజు రోజుకు బలహీనపడుతుండడంతో మొయిజ్జు ప్రభుత్వం అత్యవసర వైద్య సేవల కోసం శ్రీలంకతో ఒప్పందం చేసుకునేందుకు యత్నిస్తుంది. లక్షద్వీప్ సమూహంలోని మినీకాయ్ ద్వీపం నుంచి 70 నాటికల్ మైళ్ల దూరంలో మాల్దీవులు ఉంటాయి.