BRS : మరో రెండు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. ఆర్ఎస్పీ పోటీ అక్కడ్నుంచే..

BRS

BRS

BRS : లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ లోక్ సభ స్థానానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నట్లు తెలిపింది.

బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ – కడియం కావ్య, జహీరాబాద్- అనిల్ కుమార్, నిజామాబాద్- బాజిరెడ్డి గోవర్ధన్, కరీంనగర్- వినోద్ కుమార్, పెద్దపల్లి- కొప్పుల ఈశ్వర్, ఖమ్మం- నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్- మాలోతు కవిత, మహబూబ్ నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి, మల్కాజిగిరి- రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్- ఆత్రం సక్కును ఆ పార్టీ ప్రకటించింది. ఇప్పటివరకు 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా హైదరాబాద్, సికింద్రాబాద్, నల్లగొండ, భువనగిరి స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి.

కాగా, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అయితే ఆ పార్టీ నుంచి కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరుతుండడంతో కార్యకర్తల్లో నిరాశ చెందుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేతలతో ఓవర్ లోడ్ అయిన పార్టీ..అధికారం కోల్పోగానే పార్టీని వీడడంపై ప్రజాప్రతినిధులు అవకాశవాదాన్ని తెలియజేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

TAGS