Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమాను రెండు సార్లు రిజెక్ట్ చేసిన ఈ సౌత్ యాక్టర్..

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi : సౌత్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ అత్యధిక వసూళ్లు సాధించి 2023లో మూడో తెలుగు చిత్రంగా నిలిచింది. తమిళ చిత్రం వేదాళంకు రీమేక్ గా వచ్చిన ‘భోళా శంకర్’ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాడు. ప్రస్తుతం ఆయన మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రతీ నటుడు, దర్శకుడు ఆయనతో కలిసి పనిచేయాలని అనుకుంటారు. కానీ, ఒక స్టార్ హీరోను తన సినిమాలో పని చేయాలని చిరంజీవి ఒకటి కాదు రెండు సార్లు అడిగారట కానీ రెండు సార్లు కూడా అతనికి వీలు కాక రిజెక్ట్ చేశాడట.. ఆ నటుడు ఎవరో తెలుసా?

ఆ నటుడు మరెవరో కాదు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రస్తుతం ‘ఆదుజీవితం అలియాస్ ది మేక లైఫ్’ అనే సినిమా ప్రమోష న్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కానుంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన చిరంజీవి నటించిన రెండు సినిమాలను రిజెక్ట్ చేసిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

2017లో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఓ పాత్ర కోసం చిరంజీవి తనను సంప్రదించారని పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పృథ్వీరాజ్  అప్పట్లో ‘ఆడుజీవితం’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాకు కమిట్ అయిన ఆయన అందులో తన పాత్ర కోసం గడ్డం కూడా పెంచారు.

2019లో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్’ విడుదలైన సమయంలోనే చిరంజీవి సైరా నరసింహారెడ్డిని కేరళలో ప్రమోట్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసే రైట్స్ కొన్న చిరంజీవి మరోసారి ఆయనను సంప్రదించారట. అప్పుడు కూడా ఆయనకు వీలు కాక రాలేనని చెప్పారట.

‘ఆడుజీవితం’ గురించి చెప్పాలంటే బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ 2018లో ప్రారంభమైంది. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చి 28న వెండితెరపై సందడి చేయబోతోంది. 2008 లో బెన్యామిన్ రాసిన ‘అడుజీవితం’ పేరుతో ఉన్న మలయాళ నవల నుంచి కథను తీసుకున్నారు. ఈ నవల కూడా ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.  సౌదీ అరేబియాలో బానిసత్వంలోకి నెట్టబడే వలస కూలీ నజీబ్ పాత్రలో నటించాడు సుకుమారన్. 

TAGS