Nikhil Promotion : నిఖిల్ ప్రమోషన్.. ఏమవ్వబోతున్నాడో తెలుసా!
Nikhil Promotion : సంబరం, హైదరాబాద్ నవాబ్స్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినా ‘హ్యాపీడేస్’తో తన తిరుగులేని ప్రయాణాన్ని మొదలు పెట్టాడు నిఖిల్ సిద్ధార్థ. హ్యాపీడేస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా.. ఆయన పాత్రకు వచ్చిన క్రేజ్ హీరోకి కూడా రాలేదు. ఆ సినిమా తర్వాత ఆయన వెనుకకు తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. వేగంగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా (కార్తికేయ2తో) హీరోగా మారాడు.
హ్యాండ్సమ్ బాడీ, లుక్స్ తో పాటు నటనలో అదరగొట్టి ఎంతో మంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టిన నిఖిల్ 2020లో తను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మను వివాహం చేసుకున్నాడు. అయితే లాక్ డౌన్ సమయంలోనే వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ కావడంతో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకున్నారు.
పల్లవి మొదటి బిడ్డకు జన్మనివ్వడంతో నిఖిల్ తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. ఇటీవల జరిగిన ఓ ఫ్యామిలీ ఈవెంట్ లో పల్లవి తన బేబీ బంప్ తో ప్రెగ్నెంట్ గా ఉందనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయాన్ని వారు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.
మొదటి సారి తండ్రి కావడం కంటే గొప్ప ఆనందం మరొకటి లేదు మరియు కొత్త బిడ్డ రాక నిఖిల్ మరియు పల్లవి జీవితంలో కొత్త దశను సూచిస్తుంది. ఈ జంటను అభినందిస్తూ తండ్రిగా కొత్త పాత్ర నిఖిల్ కు ఎనలేని ఆనందాన్ని ఇస్తుందని ఆశిద్దాం.
ప్రస్తుతం నిఖిల్ తన పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’ షూటింగ్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు, దీని కోసం అతను మేకోవర్ చేయించుకొని కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు. దీని తర్వాత ఇండియా హౌజ్ అనే పాన్ ఇండియా సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకు రాం చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు ఆయన చేతిలో కొన్ని అద్భుతమైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.