Chiluka Mamidi School : వైసీపీ పాలనలో ఈ పాఠశాల దుస్థితి ఇదీ
Chiluka Mamidi School Under YCP Rule : జగన్ పాలనలో సౌకర్యాలు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లయితే అధ్వానంగా తయారయ్యాయి. ఏ రోడ్డు చూసినా గుంతలమయమే. మరమ్మతులు లేవు. పనులు చేయరు. ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది పరిస్థితి. రోడ్ల పరిస్థితిపై గతంలో జనసేన నిరసన వ్యక్తం చేసింది. రోడ్లు బాగు చేయాలని కోరినా పట్టించుకోలేదు.
రాష్ర్టంలో పాఠశాలల పరిస్థితి కూడా మరీ దారుణంగా ఉంది. రంపచోడవరం మండలంలోని చిలకమామిడి గ్రామంలోని పాఠశాల స్థితి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మరమ్మతుల పేరుతో పాఠశాలను మొత్తం అధ్వానంగా తయారు చేశారు. కింద స్లాబును మొత్తం బిచ్చలుబిచ్చలుగా చేశారు. ఏడాది కాలంగా ఇలాగే ఉంచుతున్నారు. దీంతో విద్యార్థులు బడికి వచ్చేందుకు జంకుతున్నారు.
ఏడాదిన్నర కాలంగా పనులు చేయకుండా తాత్సారం చేస్తూనే ఉన్నారు. ఎన్నికలు జరిగినప్పుడు పోలింగ్ స్టేషన్ గా కూడా దీన్ని వినియోగించుకుంటారు. విద్యార్థులు ఇందులో చదువుకోలేక ఇదే ఊళ్లో మాజీ ముఖ్యమంత్రి కట్టించిన ఓ సామాజిక భవనంలో పాఠశాల నిర్వహిస్తున్నారు. జగన్ చేసిన నిర్వాకానికి విద్యార్థులు బలవుతున్నారు. వారి పాఠశాలను మరమ్మతుల పేరుతో పగులగొట్టించి చోద్యం చూస్తున్నారు.
దీనిపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా ఊళ్లలో కూడా ఇలాంటి దుస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో జగన్ తీరుతో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పక తప్పదనే వాదనలు వస్తున్నాయి. దీంతో ఏపీలో ఎక్కడ చూసినా పనులు మాత్రం పడకేసినట్లే.