Election Schedule 2024 : ఏపీ, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడంటే..
Election Schedule 2024 : సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరుగనుంది.
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు మే 13వ తేదీన ఒకే విడతలో జరుగునున్నాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు జూన్ 4వ తేదీన ఓటింగ్ ఉండనుంది. తెలంగాణలోని 17 లోక్ సభ ఎన్నికలు కూడా ఇదే తేదీన నిర్వహించనున్నారు. అంటే రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు మే 13న దేశవ్యాప్తంగా జరిగే నాలుగో విడతలో నిర్వహించనున్నారు. కాగా, తెలంగాణ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. మే 13న ఈ ఎన్నికను కూడా నిర్వహించనున్నారు.
ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇది..
నోటిఫికేషన్ తేదీ: ఏప్రిల్ 18
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 26
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఏప్రిల్ 29
పోలింగ్ : మే 13
ఓట్ల లెక్కింపు: జూన్ 4
దేశంలోని 7 విడతల డేట్లు:
మొదటి విడత : ఏప్రిల్ 19(21 రాష్ట్రాలు)
రెండో విడత : ఏప్రిల్ 26(13 రాష్ట్రాలు)
మూడో విడత : మే 7 (12 రాష్ట్రాలు)
నాలుగో విడత : మే 13(ఏపీ,తెలంగాణ సహ 10 రాష్ట్రాలు)
ఐదో విడత : మే 20(8 రాష్ట్రాలు)
ఆరో విడత : మే 25(7 రాష్ట్రాలు)
ఏడో విడత : జూన్ 1(8 రాష్ట్రాలు)