Break for VIP Darshans : నేటి నుంచి తిరుమలలో విఐపి దర్శనాలకు బ్రేక్.. టీటీడీ కీలక నిర్ణయం

Break for VIP Darshans

Break for VIP Darshans in Tirumala

Break for VIP Darshans : కలియుగ వైకుంఠం తిరుమలలో కొలువైన శ్రీ వెం కటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి  సామా న్యుల  నుంచి సెలబ్రిటీలు వరకు పోటెత్తుతారు. శ్రీవారినీ దర్శించుకుని తమ మొక్కలు చెల్లించు కుంటారు. అయితే స్వామివారి దర్శనానికి వివిధ మార్గాలు ఉన్నాయి. సర్వదర్శనం ,ఉచిత దర్శనం, స్పెషల్ దర్శనం, విఐపి బ్రేక్ దర్శనాలు ఉన్నాయి. విఐపి బ్రేక్ దర్శనాలకు ప్రస్తుతం బ్రేక్ పడింది.

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. దానిలో భాగంగా.. ప్రతి రోజు సర్వ దర్శనం, ఆర్జిత సేవలు, 300 రూపా యల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనా లు, వీఐపీ దర్శనాలు ఉంటాయి.

ముఖ్యంగా.. రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న వ్యక్తు లు, ప్రముఖులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతి నిధు లు, రాజకీయ నాయకులు, వారి పరివారంతో వీఐపీ బ్రేక్, శ్రీవారి ఆర్జిత నిత్య సేవల్లో పాల్గొంటూ ఉంటారు. అందులోనూ.. ప్రజాప్రతినిధులు వారి అనుచరవర్గానికి, నియోజకవర్గాల ప్రజలకు సిఫా ర్సు లేఖలపై తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు. ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రతి రోజు ఉదయం సమయంలో ఉంటుంటాయి.

ప్రముఖుల నుంచి తీసుకుని వెళ్లే సిఫార్సు లేఖ లను భక్తులు ముందు రోజు తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో దర్శనం కోసం అభ్యర్థన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. టీటీడీ అధికారులు భక్తుల రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దర్శనాలకు స్లాట్‌లు కేటాయి స్తారు. ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, కేంద్రమంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సులపై వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేస్తుంటారు.

ఇటు తెలంగాణ ప్రజా ప్రతినిధులకు కూడా వీఐపీ దర్శనాల కోటా ఉంటుంది. అయితే.. త్వరలోనే ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగను న్నాయి. దానికి సంబంధించి ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. దాంతో.. నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రజాప్రతినిధులుకు ఇప్పటికే టీటీడి సమాచారం అందించింది.

TAGS