KCR-KTR : తండ్రీ, కొడుకుల నైరాశ్యం! ప్రజలపై విరుచుకుపడితే ఏం లాభం అంటున్న పార్టీ కేడర్..
KCR-KTR : పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదాకు పరిమితమైంది. దీంతో కేసీఆర్, కేటీఆర్ తమ ఓటమికి కారణమైన ప్రజలపై తమ నైరాశ్యాన్ని ప్రదర్శిస్తుండడం వల్ల పార్టీ కేడర్, నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
గతంలో ఒక సభలో ‘పాలిచ్చే బర్రెను అమ్ముకొని అక్కరకు రాని దున్నపోతును కొన్నరని’ సభకు హాజరైన ప్రజలపై అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్. రీసెంట్ గా ‘కసాయిని, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే వాడిని సీఎం చేశారని’ మరోసారి అన్నాడు. తెలంగాణ ప్రజలను అపహాస్యం చేసిన కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ రాజకీయ పరిణామాన్ని ఆయన ‘దరిద్రం’గా అభివర్ణించారు.
తెలంగాణ ఓటర్లపై తండ్రీ, కొడుకుల ద్వయం కేసీఆర్, కేటీఆర్ ఇంకా నిరాశగానే ఉన్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వారు తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే ప్రజా తీర్పును గౌరవించడం. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడం. అన్నింటికీ మించి ప్రజా ఆదేశం రాజ్యమేలుతున్నందున ప్రజలపై నిందలు వేయడం తెలివైన వ్యూహం కాదు. ప్రభుత్వ పదవుల్లో ఎవరిని ఎంపిక చేసుకోవాలనేది ప్రజల కోసమేనని ఓ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.
ఆడలేక మద్దెల ఓడిందని, ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోవడం మానేసిన వారు. ప్రతిపక్షంలోకి వెళ్లిన వెంటనే ప్రజలు గుర్తుకు వచ్చారా? అంటూ తెలంగాణ ప్రజానికం నిలదీస్తుంది. మంచైనా.. చెడయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రజా తీర్పును గౌరవిస్తేనే మంచిదని, ఆ ప్రస్టేషన్ కాస్తా.. ప్రజలపై రుద్దితే మరింత నష్టపోతారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.