Actress Lakshmi : వయసులో ఉండగా చాలా తప్పులు చేసింది.. సీనియర్ నటి లక్ష్మిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు

Actress Lakshmi

Actress Lakshmi

Actress Lakshmi : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 70వ దశకంలో ఎన్నో చిత్రాల్లో నటించిన లక్ష్మికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఇండస్ట్రీ నేపథ్యం ఉన్న లక్ష్మి 15వ ఏటనే సినీ రంగప్రవేశం చేశారు. ఆమె మొదటి చిత్రం 1968లో విడుదలైన ‘జీవనాంశమ్’. 1974లో మలయాళ మూవీ చట్టకారి, బాలీవుడ్ లో 1975లో రిలీజైన జూలీ మూవీతో విపరీతమైన క్రేజ్ సంపాందించుకున్నారు. సినిమాల్లోనే కాదు బుల్లితెరపై కూడా కనిపించి సందడి చేసేవారు. నటిగా ఎంతో క్రేజ్ ఉన్నా వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ వచ్చాయి.

70వ దశకంలో లక్ష్మి బిజీ హీరోయిన్. కెరీర్ పీక్స్ లో ఉండగానే భాస్కర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత 1975లో ప్రముఖ నటుడు మోహన్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  అయితే వీరి వివాహబంధం కూడా ఎక్కువ రోజులు నిలువలేదు. చివరిగా నటుడు, దర్శకుడు శివచంద్రన్ ను పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈమె మాజీ భర్త నటుడు మోహన్ శర్మ ఆమెపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

70 దశకంలో తామిద్దరం బిజీ నటులమని, ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించినట్టు మోహన్ శర్మ తెలిపారు. ‘‘1975 ప్రాంతంలో లక్ష్మి సడెన్ గా నా రూమ్ కు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగింది. ఆమె మాటలను  నేను షాక్ అయ్యాను. ఈక్రమంలోనే ఇద్దరం ఓ హోటల్ లో కలిశాం. నేను ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టాను. పెళ్లి గురించి ఆలోచన లేదని చెప్పాను. కానీ తను మాత్రం పెళ్లి కోసం పట్టుబట్టింది. ఆ తర్వాత ఆమె మాటకు విలువిచ్చి ఆమె నుదిటిపై బొట్టు పెట్టాను. ఆ రాత్రే తాము భార్యాభర్తలమయ్యాం. ఇద్దరు గౌరవప్రద కుటుంబాల నుంచి వచ్చాం. పెళ్లయ్యే వరకు మామధ్య ఏం జరుగలేదు. లాయర్ సమక్షంలో మా పెళ్లి విషయాన్ని మీడియాకు చెప్పాం.  అయితే ఇద్దరం బిజీగా ఉండడం వల్ల ఇద్దరికీ ఎక్కువగా కలిసే అవకాశం రాలేదు. కొన్ని విషయాల్లో లక్ష్మి పొరపాటు చేసింది. అవన్నీ చెప్పలేను. ఆమె జీవితంలోకి మరో పురుషుడిని ఆహ్వానించింది. అది తట్టుకోలేకపోయాను. కూతురు ఐశ్వర్యకు లక్ష్మికి మధ్య ఎప్పుడూ గొడవలే. నేను సర్దిచెప్పినా వారు పట్టించుకోలేదు. ఆమె నా విషయంలో ఎన్నో తప్పులు చేసింది.’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

TAGS