BRS – BSP : బీఎస్పీకి రెండు సీట్లు.. కన్ఫమ్ చేయనున్న బీఆర్ఎస్..

BRS - BSP

BRS – BSP

BRS – BSP : ఇటీవల భాతర రాష్ట్ర సమితి తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుందని తెలిసిందే. అయితే ఒక్క సీటు కోసమే వారు ఆశతో ఎదురు చూస్తున్న వేళ కేసీఆర్ ఆ పార్టీకి రెండు సీట్లు ఆఫర్ చేస్తున్నాడు. వాటిలో 1. నాగర్ కర్నూల్, 2. ఆదిలాబాద్. అయితే ఈ విషయం ముందే తెలుసుకున్న ఆదిలాబాద్ మాజీ ఎంపీ గొడం నగేష్ బీజేపీలో చేరారు.

తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వాటిలో హైదరాబాద్ లో పోటీ పెట్టినా, పెట్టకపోయినా ఒకటే. ఇక, మిగతా 16 స్థానాల్లో 2 బీఎస్పీకి వదిలేస్తున్నారు. 14 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ పోటీ చేస్తోంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు కేవలం 2 సీట్లు అడిగితే ఇవ్వకుండా వారిని బయటకు పంపారు కేసీఆర్. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల్లో వారి వల్లే గెలిచామని తెలిసినా పట్టించుకోలేదు.

కమ్యూనిస్టులకు కాంగ్రెస్ ఒక్క సీటు ఇచ్చి పొత్తు పెట్టుకుంది. అది వారికి మేలే చేసింది. సార్వత్రిక ఎన్నికలకు వచ్చే సరికి.. బీఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యాడు కేసీఆర్. నిజానికి తెలంగాణలో బీఎస్పీకి ఆదరణ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద 3.50 లక్షల ఓట్లు కూడా లేవు. అయినా బీఆర్ఎస్ కు బాగా బలమున్న రెండు స్థానలను బీఎస్పీకి వదిలేశారు.

సిట్టింగ్ స్థానం నాగర్ కర్నూలుతో పాటు గతంలో తిరుగులేని విజయం అందించిన ఆదిలాబాద్ ఇచ్చేస్తున్నారు. పొత్తు పెట్టుకున్నా లాభం లేదని తెలిసినా కేసీఆర్ ఇంతలా ఎందుకు ఆందోళన చెందుతున్నారో తెలియడం లేదని బీఆర్ఎస్ వర్గాలు ఫీలవుతున్నాయి. ఆయా స్థానాల్లో ఖరారు చేస్తున్న అభ్యర్థులు కూడా బలమైన వారు కాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

TAGS