Uday Kiran Sister : ఇన్నాళ్లకు మీడియా ముందుకొచ్చిన ఉదయ్ కిరణ్ సోదరి.. తమ్ముడి గురించి మాట్లాడుతూ ఎమోషనల్..

Uday Kiran Sister

Uday Kiran Sister

Uday Kiran Sister : టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. వీటిపై సినీ అభిమానులు, హీరోల ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు. అప్పట్లో సూపర్ హిట్ అయిన మూవీలను మళ్లీ ఆడియన్స్ లోకి తీసుకొస్తున్నారు. 4కే వర్షన్ తో మళ్లీ విడుదల చేసిన సినిమాలు మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ అన్నీ రీరిలీజ్ అవుతున్నాయి.

ఒకప్పటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ సినిమాలను కూడా రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఉదయ్ కిరణ్ అప్పట్లో వరుస హిట్లు సాధించి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఉదయ్ కిరణ్ కు స్టార్ డమ్ తెచ్చిన సినిమా అయిన ‘‘నువ్వు-నేను’’ ను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయ్ సరసన అనిత కథానాయికగా నటించగా.. దివంగత నటి శకుంతల, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు.

ఈ మూవీని ఈనెల 21 రీరిలీజ్ చేయనున్నారు. దీంతో అటు సోషల్ మీడియాలో ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరోను మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూడొచ్చు అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి చాలా సంవత్సరాల తర్వాత మీడియా ముందుకొచ్చారు. నువ్వు నేను సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

‘‘నువ్వు నేను సినిమా మా అందరికీ చాలా చాలా స్పెషల్. ఉదయ్ కు ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా రీరిలీజ్ తో మనం ఎంఎస్ నారాయణ, రాళ్లపల్లి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అహుతి ప్రసాద్, వైజాగ్ ప్రసాద్, శకుంతల వంటి మహా నటులను మరోసారి తెరపై చూడొచ్చు. ఈ సినిమా డైరెక్టర్ తేజ, మూవీ యూనిట్ కు కంగ్రాచ్యులేషన్స్. అలాగే రిలీజ్ చేస్తున్న వారికి థ్యాంక్స్’’ అంటూ భావోద్వేగం చెందారు.

TAGS